పుట:Neti-Kalapu-Kavitvam.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi


అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కధల పీఠికలో 'ఇట్టి కధల వాఙ్మయము తెలుగునకు కొత్తది ' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్లు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు ఈయన కధల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాంఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కధల్లో వర్ణిస్తారు.

ఈకథల్లో 'ఎదుగనిబిడ్డ ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్దయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదబిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు అదల్లా ఉంచి ఎలిగొరీ పద్దతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.

తెలుగు సాహిత్యంలో అబివృద్ధి కాని నూతన ప్రక్రియలను అబివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆకోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadows Tailor 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంద్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమామాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలొ చెప్పుకున్నారు.