పుట:NavarasaTarangini.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ|| సాత్వికతమముయు - ష్మత్ప్రపితామహు వలననికలరు బా_వనచరిత్ర |
శౌర్యపరాక్రమ - చాతుర్యముల్నీకు దాతస్వభావమో - ధర్మమూర్తి |
బహుజనపోషణ - పరతనీతండ్రినై జమునీకువచ్చెనో - సదయహృదయ |
సకలజనప్రియ - చారుధోరణి నీకు సహజసిద్ధమ్మురా - కులదీప |

పూషవాట్కులమున దొల్లి పొడముటరుదు |
నీవలె స్సద్గుణంబుల ప్రోవుభళిర |
తగును నీ పేరు నీ కుమా ధవుని కృపను |
విజయమందు నారాయణ గజపతీంద్ర |

గీ|| శ్రీ విజయరామగజపతి జ్యేష్ఠపుత్ర |
వీరలలితా కుమారీ కుమారశూర |
ధీరసుకుమార విద్యావతీ కళత్ర |
రాజకులముఖ్య యలక నారాయణాఖ్య ||

గీ|| కాళిదాస షేక్స్పియరుల కవిలపయి |
బ్రేమపడెదవుగాన నర్పించినాడ |
ఈకృతిన్ద్యతోడ నంగీకరించు |
మలక నారాయణగజేంద్ర యదిపచంద్ర ||

శ్లో|| తవదాసాత్మ సంభూతా | న్యనన్య సులభాకృతిః |
నారాయణ గజపతే | సాహ్యాంధ్రకృతికన్యకామ్‌ ||

                             ఆదిభట్ట నారాయణదాసుడు.