పుట:NavarasaTarangini.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిచ్చుటచే నాపె వృక్షనేచనఋణం న్రాకెట్లు తీర్చగలదో? విరజాజి పువ్వు జిల్లేడుపువ్వుల బడునట్లు వేల్పుసానికూతురు కశ్యపముని యెద్ద నున్నదను పోల్కి బాగుగలేదు. జిల్లేడుచెట్టుకన్న బొమ్మచెముడుడొంక కొంతయెప్పునేమో! పూవు, చివురు, తేనె, పండులతో బోల్చి యానడుమ వృక్షసంబంధములెని రతనముతో బోల్చనేల? "నీకోర్కె యిపుడనుకూలించె"నని ఇదూషకుడనుట కన్న నీరొట్టె నేతిలోబదినదన" బాగుండును. "నవ్వులాట కన్నమాట నిజముగ నెంచకు" మని రాజు విదూషకున కనుట ధీరోదాత్తలక్షణము కాదు. పొదలో బొంచుండి శకుంతల తా వ్రాసిన నలపుజాలు జదువగానే యుట్టిపడ్డట్టువచ్చి "మన్మధుడు నిన్నుం దపింపజేయుచున్నాడు గాని నన్నుం దగుల బెట్టుచున్నా" డని పైబడబోవు టదెంత వైదికపు నరనము? శకుంతల కన్నెయయ్యు నంత:పురస్త్రీల నెడసియుంటంగుందు రా జని సానిపిల్ల యనుటచే మప్పబడినదానివలె బల్కినది. కేవలకన్యక కట్టిపల్కు స్వభావమా? యని రాజు సరసమునకు మొదలిడుట యెంత బాగున్నది! మిట్టమధ్యాహ్నపు వేసవియెండ మండుచుండగా నిషిద్దవేళ న్సంయోగమున కేర్పర్చుట యనుచితము. క్రియ యంతయు న్ముగిసినపిదప 'నాతండ్రి నిట్టి పనిచేసి యవమానింపదగదు. నాసుఖ లనుమానించెదరరేమో. ఇంక నన్విడువు"మని ప్రౌఢజార యనునట్లు కేవలకన్య యనుట యస్వాభావికము. కామకేళికృత్యముల నిట్లు బాహాటముగా రంగస్థలమునం దెట్టి యనౌచిత్యము వర్ణింపరాదు. బలాత్కారముగా నాపె నాపుట. 'యందుము విడిచెదను: నీవాతెఱతేనె గ్రోలనీ ' యని తలపడుటయు సభాసదులకు లజ్జా జనకము కాదా? ఇట్టి యసభ్యములు ప్రచురింపదగునా? 'బారవ! యిట నా సేమ మరయు గౌతమి నచ్చుచున్నది. నీవు చెట్టుచాటున దాగుండు ' మని శకుంతల యనుట చూడగా రాజు శకుంతలను