పుట:NavarasaTarangini.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అట్టి వెఱ్ఱికి గారణ మాపెతండ్రి యాకస్మికముగా హేమ్లెట్టుచే జంపబడుటయని హేమ్లెట్టు పినతండ్రిభ్రమపడెను. బుద్ధుడు పట్ట ణపువీధి స్వచ్చెడి మనుజశవముం జూచినప్పుడు తనసారధిం బ్రశ్నించి నట్లు హేమ్లెట్టు సమాధిచెంగట హోరేష్యోను బ్రశ్నించి ఈ అస్థిరమానుషజీవితముపై మిక్కిలి రోతపడెను. మఱియు దుష్టశిక్ష గావించి లోకమున సదుపకరముసేయుటయే జన్మమునకు సార్థకత యని యోఫీలాకు వలపుజాబు వ్రాసిన తరువాత రూఢిగ దెలిసెను. హేమ్లెట్టు తల్లి కన్నను మఱియు దనప్రాణముకన్నను దుష్టశిక్షణజేసి పితౄణముం దీర్చుకొనిటయే ముఖ్యమని యెంచెను. ఎఱ్ఱెత్తినట్లు తన యుద్దేశము నెఱవేర్చుటకు నటింపకున్న యెడ హేమ్లెట్టు ధీరోదాత్తుడనవచ్చును. హేమ్లెట్టు తల్లిక్ హేమ్లెట్టునకు వెఱ్ఱేత్తినట్లు సందియమున్నదేమోకాని హేమ్లెట్టు పినతండ్రికి మాత్ర మట్టినమ్మకములేదు. హేమ్లెట్టు తన్ను జంపి పగదీర్చుకొనుటకై వేసిన వేసమనియే రూఢిగ విశ్వసించెను. పైసంగతులవల్ల హేమ్లెట్టు ప్రత్య్హక్షముగా దనతండ్రిం దనపినతండ్రి ద్చంపుట చూడలేదు. లోకులు గుసగుసలాడుకొని యుండ వచ్చు. ఆకారణముంబట్టియు దనయిర్వురు సనయస్కులు తనయను మానము న్బలపర్చగా దీవ్రసంకల్పవశమున దనకు దోతెంచిన తన తండ్రి దయ్యము తనపినతండ్రి దౌర్జన్య్హముం దెలిసినట్లు భ్రమబడుట చేతను మఱియు దనతల్లి, దన తండ్రి గతించిన రెండునలలో దన పినతండ్రి పెండ్లాడిన కారణముం బట్టియు దనతండ్రిచావు దృష్టాంతంగా దెల్పు నొకనాటకమున్గడ వఱకు వినజాలక లేచిపోయిన తనపినతండ్రి వైఖరిం బోల్చియు హేమ్లెట్టు తనపినతండ్రిం దురుమాడి పితౄణము దీర్చి లోకులకు దనధర్మాచరణము దెలియబర్చ నిశ్చయించెను. హేమ్లెట్టించు మించిరువది చిరునదియైదేండ్లు వయస్సుకలిగి యుండవచ్చును. హూణమతముంబట్టి తనతల్లి తనపినతండ్రి న్మార్మనుమాడు టొకదోషముకాదు. తనతల్లి