పుట:NavarasaTarangini.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీగడ, చల్ల మొదలగు వికారము లందునపుడు వింతవింత చవులగు. అందొకదానికొకటి పోల్చి యెద్దియు నెక్కువనిగాని తక్కువని కాని యనరాదు. సంస్కృతము పాలన్ బోలి దేశభాషలను బెరుగు మొదలగు వికృతుల నందెడును. మఱియు నూహ మొదట నొదవి పిదప భాషారూపమున బయలుపడియెనుగాన భాషలతో బనియేమి? యూహల నొండొంటికి బోల్చి హెచ్చుతగ్గు లేర్పర్చవచ్చు నన్నచో నదియుగూడ వీలుపడదేమన నేయూహల కలవడినవారల కాయూహ లెక్కువగ నివాసస్థానముములు భోజనపదార్ధములు మొదలగువాని వలె రుచించుట యనుభవసిద్ధముగదా! ఇంద్రనీలములవంటి కురులిచటివారలకు - మఱి బంగరుచివురుల బోలిన యెఱ్ఱని కొప్పు హూణులకుం, జల్లని యాదరము మనలో - వెచ్చని యాదరము పాశ్చాత్యులలోను న్రుచింపలేదా? ఇట్లు తర్కించినకొలది షేక్సిపియర్కాళిదాసుల కవిత్వములలోని వాసి యేర్పర్చ వలనుపడదు ఏభాషలందైన గవులు నా బరంగిన వారల లో బరులయూహలు దొంగిలించి మచ్చునకు మచ్చువన్ని యుదర పోషణార్ధముకాని, పేరెక్కుటకుగాని గ్రంధములల్లువారు నూటికి దొంబదితొమ్మండ్రు నిజమైన కవు లేకాలమునందైన గడునరుదు. సహజకవులకు సామాన్యప్రసిద్ధియం దొంగకవుల కెక్కువ కీర్తి, కవితారసజ్ఞలు సత్కవులకంటె గడునరుదు. షేక్స్పియర్కాళిదాసు లకన్న నెక్కడు కవితాప్రతిభగల కవిశిరోమణులు సామాన్యలుగ నుపెక్షింపబడియుండవచ్చు. గొందఱి కావ్యంబులు ప్రచురింపంబడి యు గొన్ని హేతువులచే గణింపబడకయు బ్రఖ్యాతి గొనజాలకున్నవి. పలుగురాడిన మాట పాటి కెక్కుంగనక బైయిరువుర స్గవిశ్రేష్ఠులుగ నెన్ని వారి నొండొరులతో బోల్చునపుడు నా యభిప్రాయమున నేపాటిది? వారల కవిత్వమందలి సొగసులేర్చుటకు దొరకొనినప్పుడు పేదవా డొకతావున నవరత్నము లపరిమితముగ