పుట:Navanadhacharitra.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

57

రసమున నుమిసి[1]క ◆ ర్పరమున దొలఁచి
వెలఁది ముత్యపుఁ బోణి ◆ వెలసివజ్రాల
తళుకునఁ దొలఁచియు ◆ ధళధళ మెలఁగు
ప్రాలేయధామబిం ◆ బము కెలనేల
వ్రాలెనో యన నభి ◆ రాగంబు మించు
మీనుమీసము లీల ◆ మిసమిస మించు
మేని క్రొమ్మించుల ◆ మెఱుఁగు వెన్నెలల
వెదచల్లు నొకమంచి ◆ వెల్లపావురము
ముదము దీపింప నా ◆ ముందట వ్రాలె
వ్రాలిన నెందుండి ◆ వచ్చె నిచ్చటికి
నాలోకనోత్సవం ◆ బయియుండ నిపుడు
పొడతోఁచె నని తల◆• పోయఁ బావురముఁ
గడి పట్టునెపమునఁ ◆ గడువన్నె మెఱుసి
మనమున శంకణు ◆ మాత్రంబులేక
చనుదెంచె నిచటికి ◆ సారంగధరుఁడు
వచ్చి రెప్పార్పక ◆ వాఁడు నావలనఁ
జెచ్చెర వీక్షించి ◆ చిత్త మంతయును
జడిగొన్నభావజు ◆ సాయకనిహతిఁ
దొడరిదొప్పఁగఁదోఁగి ◆ [2]ధృతిఁ దుప్పఁదూలి
వావి వోవిడిచి కా ◆ వరమునఁగదిసి
చేపట్టి ననువన్నె ◆ చిరునవ్వు నిగుడ
మత్తచకోరాక్షి, ◆ మరువంపు లాక
క్రొత్తముత్యపు బొమ్మ ◆ కొఱనెలసోగ
చిలుకలకొలికి వా ◆ సించినకలువ
మెలఁగు తొలకరికారు ◆ మెఱుఁగ కాముకుల
డెందంబుగుఱులు బీ ◆ టికవాఱ నాటు
కందర్పమోహన ◆ కాండంబుతోడ
జగడించు నీకటా ◆ క్షంబు నామీఁద
నిగుడించి నన్ను మ ◆ న్నించుట తగదె
నీ నెరికురులకు ◆ నీ మోమునకును
నీ నయనములకు ◆ నీ పల్కులకును

  1. కర్పూర.
  2. ఉచ్చారణ వశంబున 'ధుతి' యని భ్రాంతిపడి యిట్టియతి కవియే ప్రయోగించియుండును. చూ. పుట 41. సృపు... రెండు.