పుట:Navanadhacharitra.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

19

బరిపూర్ణతనువును ◆ బహు సద్గుణములు
నురుతర జ్ఞానంబు ◆ నొక్కటం గలిగి
మీననందనుఁడనై ◆ మీనంబు కడుపు
లోనుండి వెడలితి ◆ లోలత మీఱ
వినిపించు నాయోగ ◆ విద్యావిధంబు
వినుచుండి యంతయు ◆ వినివిని గిరిజ
యూకొన మఱచిన ◆ నూకొనుచుంటి
[1]నోకాలకంఠ ధ◆న్యునిఁగా నొనర్చి
మన్నించు మనుచు న◆మ్మధురవాక్యముల
సన్నుతిచేయఁ బ్ర◆సన్నుడై శివుఁడు
తన వధూమణికి నిం◆తయుఁ జెప్పవలయు
నని తలపోయంగ ◆ నంత లోపలను
దెలిసి శంకరుని న◆ద్దేవి వీక్షించి
పలికె నప్పుడు మీరు ◆ పరిపాటిఁ జెప్ప
లలిత యోగామృత ◆ లహరిలోఁ జిక్కి
తెలిసితి నిటమీఁదఁ ◆ దేట తెల్లముగ
నెఱుఁగ నే నంతయు ◆ నెఱిఁగింపు మనుడుఁ
గఱకంఠుఁ డంబికఁ ◆ గనుఁగొని పలికె
నదియు నట్లుండె నా ◆ యాశ్చర్య మొకటి
విదితంబుగా నది ◆ విన వీవు మొదల
నతివేడ్కఁ దోయ మ◆ధ్యంబున మనము
రతికి దగ్గఱఁ దత్త◆రమున రేతంబు
తోయంబు లోపలఁ ◆ దొరఁగిన దాని
నాయెడ మ్రింగె నా ◆ యందు మీ నొకటి
దాననే గర్భ మ ◆ త్తఱిఁ దాల్ప నందు
లో నొక్క పురుషుండు ◆ లోలతనుండి
నీకు విన్పింప నే ◆ నిర్మలసూక్తు
లూకొనుచుండె నీ ◆ వూకొనకున్న
[2]ననిచెప్పి మఱియు ని ◆ ట్లనియెఁ బార్వతికి
మనసిజాంతకుఁ డిక్కు ◆ మారకుఁ డిపుడు
[3]మనము రమ్మనకయే ◆ మత్స్యోదరంబు

  1. వోకాలకంధరధన్యుగానొనర్చి
  2. చెనిచెప్ప... బార్వతియు మనసిజాంతక యిక్కు
  3. 'మనము యే తెమ్మ నక మత్స్యయుద'