పుట:Navanadhacharitra.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

7

ననవరతాభ్యుద ◆ యాభివృద్ధియును
ఘన తపోరాజ్య సౌ ◆ ఖ్య ప్రసిద్ధియును
గృప మీఱ నొసఁగు శ్రీ ◆ గిరిభర్తపేరఁ
ద్రిపురదానవ మద ◆ ద్విప సింహుపేరు
సురనదీధరుపేర ◆ శుక సనకాది
వరయోగి నుత దివ్య ◆ వైభవు పేర
ధరకన్యకా పయో ◆ ధర పరిలిప్త
సరస చందన సము ◆ జ్జ్వల వక్షుపేరఁ
గరుణాంబునిధిపేరఁ ◆ గనకాద్రిచాప
ధరుపేర భక్త మం ◆ దారునిపేర
వామదేవునిపేర ◆ వరదునిపేర
శ్రీ మల్లికార్జున ◆ శ్రీ మహాదేవు
పేర [1] నేనొనరించు ◆ ప్రియకథా సూత్ర

కథా ప్రారంభము


కైలాస వర్ణనము


మేరీతి ననిన ము ◆ న్నెల్ల కాలమును
శ్రీకరం బై సుప్ర ◆ సిద్ధమై సర్వ
లోక సంస్తుత్య మై ◆ లోచనానంద
జనక మై బహుసుఖా ◆ స్పద మై విచిత్ర
వినుత నానామణి ◆ విస్ఫురత్కోటి
విమల కుందాది సు ◆ వికచ ప్రసూన
సముదయ వర పారి ◆ జాత సుజాత
చూత చందన కుంద ◆ సురదారు చారు
కేతకీ కింశుక ◆ కేసర ప్రముఖ
సరస మహీరుహ ◆ చ్ఛాయ నిషణ్ణ
సురవధూ మధుర భా ◆ సురగీయమాన
హరబిరుదాంక మై ◆ యవిరళోత్ఫుల్ల
నిరుపమ కనకాబ్జ ◆ నికర కాసార
కలితమై నీహార ◆ కర్పూర పూర
[2]బల బలాంతక నాగ ◆ ఫణి రాజ రాజ
శారదామృతరస ◆ శారదాంభోద

  1. నే నొనర్చెడి.
  2. బలబలారి తరనాగ.