పుట:Navanadhacharitra.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

నవనాథచరిత్ర

[1] ననుజాతుఁ డగునయ్య ◆ లామాత్యుకూర్మి
తనయుఁ డుత్తముఁడు గౌ ◆ తమగోత్ర[2]జుండు
భ్రమరాంబికా వర ◆ ప్రాప్త విచిత్ర
విమల సాహిత్య ప్ర ◆ వీణాధికుండు
ననఘచిత్తుఁడు గౌర ◆ నాహ్వయఖ్యాతుఁ
దన సముఖమునకుఁ ◆ దగఁ బిలిపించి
కరుణామృతము నిండఁ ◆ గడలొత్తుచూపుఁ
బరగించి యుచిత సం ◆ భావన నెరయ

అంకితము


మన్నించి మా కొక్క ◆ మధురమై వెలయు
సన్నుత నవనాథ ◆ చరితంబు ద్విపద
కావ్యంబుగాఁ జెప్పి ◆ కమలజ విష్ణు
సేవ్యమానునకును ◆ శ్రీశైలపతికి
శంకరునకు బాల ◆ శశిశేఖరునకు
నంకితం బొనరింపు ◆ మనుచుఁ గర్పూర
పూరితం బైన తాం ◆ బూలంబు లొసఁగి
గారవించుటయు ది ◆ గ్గనఁ బ్రమోదంబు
దలకొని మత్కవి ◆ తావిలాసంబు
వెలయ మీపంపు గా ◆ వింప భాగ్యంబు
గలిగి ధన్యుఁడనై తిఁ ◆ గామితార్థములు
ఫలియించె ననుచు స ◆ ద్భక్తిఁ దదాజ్ఞఁ
దలమీఁద నిలిపి డెం ◆ దపుఁదమ్మిలోన
నెలకొ[3]న భ్రమరాంబ ◆ నిలిపి పూజించి
వరశివ సమయ [4] ని ◆ ర్వాణధుర్యునకుఁ
[5] బరసమయధ్వాంత ◆ బాలభానునకుఁ
బరమ యోగాంబుధి ◆ పాదరేణునకు
నిరుపమ శివతంత్ర ◆ నిర్మలమతికిఁ
బావనునకు సర్వ ◆ భాషావిశేష
కోవిదునకు రాయ ◆ గుణశిఖామణికి
దుర్వార జైన సిం ◆ ధుర మృగేంద్రునకు
సర్వజ్ఞునకు ముక్తి ◆ శాంతరాయనికి

  1. 'అనుజాతుండగు నయ్యలమాంబ్బకూర్మి' అని వ్రాఁతప్రతులు.
  2. జాతు.
  3. ని.
  4. నిర్వర్ణ.
  5. పరమయ యాద్యంతం.