పుట:Navanadhacharitra.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

5

వహి కెక్కు నిజ నిర ◆ వద్య చిహ్నముల
తోడ మహామహా ◆ త్ముల దపోమహిమ
రూఢి కెక్కిన మునీం ◆ ద్రులుఁ దత్వవిదులు
మరి పద వాక్య ప్ర ◆ మాణజ్ఞు లగుచుఁ
బరగు విద్వాంసులు ◆ బహువిధకావ్య
నాటకాలంకార ◆ నైపుణిఁ జాలఁ
జాటువ కెక్కిన ◆ సత్కవీశ్వరులు
నల రాగదోషంబు ◆ లాఱు నెనిమిదియుఁ
దొలఁగించు గుణము లై ◆ దును రెండు నెలమిఁ
దలకొని గాత్రజం ◆ త్రంబుల నేర్పు
గలిగి వాసికి నెక్కు ◆ గాయకోత్తములు
ననుపమం [1] బగు సర ◆ సాతంక కలిత
వినుతాభినయ చతు ◆ ర్విధ నాట్యములును
సరిలేని నటనటీ ◆ జనులుఁ బాఠకులు
దొరలు భృత్యులు నమా ◆ త్యులుఁ బురోహితులుఁ
బరిచారకులు రాయ ◆ [2] బారులు వైద్య
వరులు దైవజ్ఞులు ◆ వరుసతోఁ గొలువఁ
గొలువుండి బహుకథా ◆ గోష్ఠీ విశేష
ములు ..... ..... ..... ..... ..... ..... .....
నవిరళ యోగ వి ◆ ద్యాధికులైన
నవనాథవరుల [3] పు ◆ ణ్య ప్రవర్తనలు
పరగ, శ్రీగిరికవి ◆ పద్యబంధముల
విరచించినాఁ డది ◆ ద్విపద కావ్యమునఁ
జెప్పింపవలయుఁ బ్ర ◆ సిద్ధి పెం పలర

కృతికర్త


నిప్పుడుగల సుక ◆ వీంద్రులలోన
సరస సాహిత్య ల ◆ క్షణ వివేకముల
సురుచిర మధుర వ ◆ చో విలాసములఁ
గులశీలములను స ◆ ద్గుణ కలాపముల
నలవడ్డవాఁ డెవ్వఁ ◆ డని విచారించి
సింగయ మాధవ ◆ క్షితిపాలమంత్రి
పుంగవుఁడై యొప్పు ◆ పోతరాజునకు

  1. బలర రసాటంక.
  2. భారు
  3. పుణ్యవర్తనములు.