పుట:Navanadhacharitra.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

3

మహిత బిజ్జలరాయ ◆ మాన మర్దనుఁడు
సన్నుత శైవదీ ◆ క్షా గురుం డసమ
సన్నాహ గజపతి ◆ సప్తాంగ శూరు
శ్వేతాంబర ప్రాణ ◆ వితత జీమూత
జాత మహోదగ్ర ◆ జంఝానిలుండు
పరసమయాంభోధి ◆ బడబానలుండు
వరశరణాగత ◆ వజ్రపంజరుఁడు
విపుల విశ్వంభరా ◆ విశ్రు తాశేష
నృప[1]వరస్వీకృత ◆ నిజశాసనుండు
బంధుర నిజతపో ◆ బల విశేషాను
సంధాన రక్షిత ◆ సకలకర్ణాట
మండలాధీ[2] శర ◆ మా విలాసుండు
చండ విరోధి తు ◆ షార భాస్కరుఁడు
నరనుత వితరణ ◆ నందిత సుకవి
వరతిరస్కృత ..... ..... ..... ..... ..... .....
..... ..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
..... ..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
సంతాన [3] కృతకథా ◆ స్తవ పరిశ్రముఁడు
కలిత యశఃపూర ◆ కర్పూర తిలక
లలిత ది [4] క్కాంతాల ◆ లాటమండలుఁడు
ప్రణుత నిరంకుశ ◆ ప్రతిభా వధూత
ఫణిసార్వభౌముఁ డ ◆ ప్రతిమ ప్రభావుఁ
డవిరళ యోగవి ◆ ద్యా నిధి యపర
శివమూర్తి సంతతా ◆ శ్రిత కల్పతరువు
ఘన [5] ముక్తిశాంత భి ◆ క్షావృత్తి రాయఁ
డనుపమం బైన మ ◆ హా వైభవంబు
దనర విచిత్ర వి ◆ తాన రమ్యమును
కన దుదంచిత హేమ ◆ కలశ భాసురము
కర్పూర హిమజల ◆ కాశ్మీర మిళిత
దర్పసా రాంబుసి ◆ క్త ప్రదేశమును
దపనీయ జాల [6] కాం ◆ తరగత ధూప

  1. సరసీకృత.
  2. శ్వరమా విలాసనుఁడు.
  3. గతకదా.
  4. క్కాంత తాలలాటమండలుండు.
  5. ముక్తి కాంతభిషా.
  6. కాంతాంతరధూప.