పుట:Navanadhacharitra.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

నవనాథచరిత్ర

నధిగత శ్రీపర్వ ◆ తైక నితంబ
బుధజనావన పరి ◆ స్ఫుట కృపాలంబ
భ్రామ [1] రాంబ నభిమత ◆ ఫల సిద్ధి నెరయ
విమలచిత్తమున భా ◆ వించి సేవించి
సారంబుగా [2] వేడ్క ◆ సమకొల్పు బీజ
పూరంబు వలకేలఁ ◆ బొల్చు రత్నాల
హారంబు డాకేల ◆ నాదిత్య మకుట
హీరంబు దలఁగల్గు ◆ హేరంబుఁ బొగడి
భద్రకాళీ ముఖ ◆ పంకజ భ్రమరు
భద్రదాయకు వీర ◆ భద్రేశుఁ గొల్చి
నందికేశ్వరు నభి ◆ నందించి ప్రమథ
బృందంబు నర్చించి ◆ పృథ్విపై నెల్ల
సిద్ధులు గలిగి ప్ర ◆ సిద్ధు లైనట్టి
సిద్ధముఖ్యుల నుతి ◆ సేసి మున్నెన్నఁ
దగిన బాణాది స ◆ త్కవులకు మ్రొక్కి

కృతి ప్రశంస


జగతిపైఁ గల సప్త ◆ సంతతులందు
నెఱయ నాకల్పమై ◆ నిర్మలకీ ర్తి
వఱలుట సత్కవి ◆ వఱలుటగాన
సురుచిర మద్వచః ◆ స్ఫురణ శోభిల్ల
విరచింతు నొకకథా ◆ వృత్తాంత మనుచు
నకలంకముగఁ గోర్కు ◆ లడరుచున్నంత
నొకనాఁడు మద్భాగ్య ◆ యోగంబుకతన

ముక్తిశాంత భిక్షావృత్తి రాయ ప్రశంస


శ్రీమహనీయ ప్ర ◆ సిద్ది పెంపెసఁగు
శ్రీ మల్లికార్జున ◆ శ్రీ మహాలింగ
సర్వలోకో త్తమ ◆ సామ్రాజ్యభార
నిర్వాహక ప్రౌఢి ◆ నీతికోవిదుఁడు
కుహనాంబరథ (?) జైన ◆ కోలాహలుండు

  1. రాంబికాభిమఫల
  2. వేల్పు ....... బుపడిగల . . . . . గల సకలామరమకుట భారంబు గల మహా ... అని వ్రాఁతప్రతి. ఈ కవియే రచించిన హరిశ్చంద్ర ద్విపదలోఁ బైరీతి నుండుటచే నట్లు సవరణ చేయఁబడినది, హరిశ్చంద్ర తాళపత్ర పుస్తకమునఁగూడఁ గొంత పాఠభేదము గలదు.