పుట:Navanadhacharitra.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

275

నే దేశములకైన ◆ నేఁగుద మింక
నిందున్న మృతి తప్ప ◆ దితనిచేఁ ద్రోవ
యందుఁ జోరులు ప్రాణ ◆ హానిఁ గావింప
[1]రర్థ నాశమె కాని ◆ యనుచు నందఱును
దీర్థయాత్రలు సేయు ◆ తెఱఁగు నటించి
కుఱుపట్టు గొడుగులుఁ ◆ గోలలుఁ గావి
[2]యఱల దోవతులు నో ◆ రచ్చు చెప్పులును
దేవపూజలుఁ గర ◆ దిత్తులుఁ గంచి
కావళ్లు మాత్రలుఁ ◆ గైకొని వెడలి
తత్తరింపుచు వెంటఁ ◆ దలవరు లెఱిఁగి
వత్తురో యను భీతి ◆ వారక గునుకు
బరువు వెట్టుచుఁ దొట్రు ◆ బడుచుఁ బల్మాఱు
తిరిగిచూచుచు దారిఁ ◆ [3]ద్రెళ్లుచు శిఖలు
విడఁ గచ్చ లురుల బ ◆ ల్విడిఁ జమరింప
నడుఁకుచుఁ జనిరి నా ◆ నాపదంబులకు
మఱియంత రాజ కు ◆ మారు లాచంద
మెఱిఁగి యందఱుఁ గూడి ◆ యిది యేమి వీఁడు
కర్జంబు దలఁపక ◆ కడగి యసంఖ్య
దుర్జనంబులు చేయఁ ◆ దొడరె నేఁడిట్లు
తనపాలి దైవంబుఁ ◆ దా నే మెఱుంగు
మనకేమి కొఱఁత నె ◆ మ్మది నిండ్లకడల
నుండఁగాఁ దానూర ◆ కుండిన లెస్స
కండక్రొవ్వున నటు ◆ గాక రోషించి
పట్టఁ బంపినఁ బట్టు ◆ వడి దీను లగుచు
నట్టి పెల్లలలోన ◆ వసమఱి చచ్చి
యిహపరంబులు రెంటి ◆ కెడయగు టరయ
మహిలోన రాచధ ◆ ర్మము గాదు గాన
బలిమిఁ జూపుద మట్టి ◆ పట్టునంగూడి
[4]యిలనగును యశంబొ ◆ మృత్యువోయనుచు
ఘనయుద్ధమునను బ్రా ◆ కటముగానిల్త
మని దృఢనిశ్చయు ◆ లై యుండి రంత

  1. నందునాశమె.
  2. యెఱ్ఱదోవతులుగోరచ్చు.
  3. దాకితెల్లుచు.
  4. యలయశోవా మృత్యుదేవత యగుచు, ఘనయజ్ఞులును హాటంబుగా బలుకు.