పుట:Navanadhacharitra.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

267

తొగలను దొరల మం ◆ త్రుల వీడుకొలిపి
యనురాగ మొదవ న ◆ భ్యంతరంబునకుఁ
జని కుబుసంబు ల ◆ చ్చటఁ దివుచుటయు
వెస మేఘపటలంబు ◆ విరిసినఁ బ్రభలు
దెసలఁ బర్వఁగ నొప్పు ◆ దినకరుకరణి
విలసిల్లువిభుఁ జూచి ◆ విస్మయానంద
కలితాత్మ [1]యయి ప్రియ ◆ కాంత యిట్లనియె
దేవ నీ మేన నొం ◆ దిన మహారోగ
మేవిధంబునఁ బాసెఁ ◆ నిది కడుఁజిత్ర
మెచ్చోటఁ దిరిగితి ◆ వెచటఁ గూర్చుంటి
వెచ్చటఁ బవళించి ◆ తేయాకుఁ దింటి
వే మహీరుట్ఛా య ◆ కేగితి ఫలము
లేమి భక్షించితీ ◆ వేలతాంతములు
తలఁబూని తెక్కడఁ ◆ ద్రావితి నీరు
తలపోసి చెప్పు మం ◆ తయు నాకు ననిన
వినుదేవి నేఁ బోయి ◆ వేఁటలాడించి
చనుదెంచుచోఁ జిక్కె ◆ సగ్గెడవాఁడు
కడుదూరమున దప్పి ◆ ఘనమైన యెండఁ
బడి నీరుకందువఁ ◆ బరికించుకొనుచు
నడవిలోపల సలి ◆ లాశయం బొకటి
పొడగని యుదక మి ◆ మ్ములఁ గ్రోలి మేను
గడిగి [2]నిర్మలినాంశు ◆ కమ్ములఁ గట్టి
తడయక వచ్చితిఁ ◆ దత్ప్రభావంబు
గానోపు నింతకుఁ ◆ గారణం బనుచుఁ
దానది ఘనముగాఁ ◆ ద్రవ్వింపఁ దలఁప
నా రాజుదేవియు ◆ నా సలిలంపు
భూరిశక్తికిఁ జిత్త ◆ మునఁ జాల మెచ్చె
మఱునాఁడు నృపతి స ◆ న్మణి భూషణములు
మెఱయ మెఱుంగులు ◆ మీఱ మైకాంతి
కొమురొప్పగాఁ బెట్ట ◆ కొలువున నుండి
[3]కొమరుల నిజనియో ◆ గులఁ బిల్వఁ బంప
వారునువచ్చి భూ ◆ వరుఁ జూచి యతని

  1. యుత.
  2. నిర్మలినలింగమున
  3. కొమలనిజయోగుల.