పుట:Navanadhacharitra.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

నవనాథచరిత్ర

తలల వంచుటయుఁ ◆ బ్రధానుల లోనఁ
జనవరియగు నొక ◆ నచివుఁడా విభునిఁ
గనుఁగొని దేవ యీ ◆ కపట కర్మమునఁ
దగునె వర్ణాశ్రమ ◆ ధర్మబోధకులఁ
దెగ నాజ్ఞసేయ ధా ◆ త్రీ నాయకులకుఁ
బిలిపించి మది నీవు ◆ ప్రియపడి యడుగఁ
దలకొని తన మహ ◆ త్త్వము చూపెఁగాక
సొలవక సంసార ◆ సుఖములు రోసి
యెలమి యేకాకియై ◆ యీరీతిఁ దిరుగు
నతఁడేల చేయుఁ [1]బ ◆ రాంగనాసక్తి
నితరుల భంగి నూ ◆ హింతురే యిట్లు
తొలి తొలిఁ బ్రార్థించి ◆ తోడి తెచ్చుటకు
ఫలమెయిప్పుడు చంపఁ ◆ బంపు మనుటయు
నలఁకువు లేక మ ◆ హాత్ములఁ దొడర
వలదు నిష్కారణ ◆ వైరంబు పూని
నావుడు వినియు వి ◆ నని చెవుల్ చేసి
భూవల్లభుఁడు ప్రొద్దు ◆ వోయె మీరింక
పదఁడని యనిపి య ◆ భ్యంతర కేళి
సదనంబునకు నేగి ◆ శయనించె నంత
నల దేవశిల్పి జం ◆ భారి కొల్వునకు
నెలమి నిర్మించిన ◆ నెర [2] హేమమేడ
పొలుపున నరుణ వి ◆ స్ఫురణఁ గెంపారి
విలసిల్లు నుదయాద్రి ◆ విపుల శృంగమున
ఘనమైన మాణిక్య ◆ కలశమో యనఁగ
వనజమిత్రుఁడు తూర్పు ◆ వంక సొత్తెంచెఁ
దదనంతరమున ను ◆ ద్ధతి నిజాస్థాన
సదనంబు కే తెంచి ◆ జననాయకుండు
రత్న గోరక్కుని ◆ రప్పించి కపట
యత్నంబు నిరతి మి ◆ థ్యా వినయంబుఁ
గావించి మ్రొక్కి యె ◆ క్కడ మీకు నుండఁ
గా వేడ్కయయ్యె న ◆ క్కడికి విచ్చేయుఁ

  1. జేయన్యయాంగనాశక్తి.
  2. వ్రాత ప్రతినిబట్టి యీపాఠము గ్రహింపఁబడినది. పైడి మేడయని సవరించిన సవరింపవచ్చును.