పుట:Navanadhacharitra.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

259

సూటి నన్యుని నింకఁ ◆ జూడ నారాజు
నైన నన్నట్లు గా ◆ [1] ఢానురాగమును
బూని పద్మిని రయం ◆ బున మోమువంచె
దెసల సంధ్యా [2]జల ◆ స్తిమితంబు లగుచు
[3]ననులొత్తు తిమిరబీ ◆ జంబులో యనఁగ
వనజాతముల వెలు ◆ వడి వికసింప
మొనయు నీలోత్పల ◆ ముకుళ జాతముల
నలమి పాదుల మూతు ◆ లల్లనఁ జేర్చి
యెలదేఁటి కదుపు లె ◆ ల్లెడ నుల్లసిల్లె
నలి నాకభువనంబు ◆ నకు సుధాశనులు
తళుకుసుపాణి ము ◆ త్యాల మేల్కట్లు
గట్టిన గతి తార ◆ కా వితానంబు
దట్టమై యంబర ◆ స్థలిఁ బొల్పుమీఱెఁ
గినుకఁ గైకొని మీన ◆ కేతుఁడు విరహి
జనముపై వైచిన ◆ చక్ర మనంగఁ
గ్రొత్త మించులు గిఱి ◆ కొనఁ దూర్పుఁ గొండ
నెత్తంబుపైఁ దోఁచె ◆ నీరజారాతి
ఆ సమయంబున ◆ నమ్మహీనాథుఁ
డాసిద్ధవరుని పెం ◆ పాత్మ నూహించి
వితత సమాకర్ష ◆ విద్య యీభంగి
నితనికి సిద్ధించె ◆ నెద్దాని కలిమి
బలిమి నెవ్వని ప్రియ ◆ భామినినైన
నెలమి రప్పించి ని ◆ జేచ్ఛఁ గ్రీడింపఁ
గలవాఁడు వీని నే ◆ గతినైనఁ జంప
వలయు (నంచు) నిజాప్త ◆ వరుల మంత్రులను
రప్పించి తన విచా ◆ రము వారితోడఁ
జెప్పిన మనమునఁ ◆ జింతించి యకట
యీకుచ్చితపు బుద్ధి ◆ యీ నృపాలునకు
నేకీడు రానింత ◆ యెసఁగునో కాక
వలదన్న మా నెడు ◆ వాఁడు గాఁ డితఁడు
దెలుపరాదింక నే ◆ తెఱుఁగొకో యనుచుఁ
గలఁగి యొండొరులు మొ ◆ గంబులు చూచి

  1. గూడ ననురాగ మొదవ
  2. సమాసిక్తంబు
  3. నెదిరిన