పుట:Navanadhacharitra.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

249

రసయోగశాస్త్ర ని ◆ ర్మాతయై మహిమ
నెసఁగు నాగార్జును ◆ కేను శిష్యుఁడను
వ్యాళి నా పేరా మ ◆ హాత్ముని కరుణ
నోలీ చతుర్వేద ◆ యోగ భేదములు
వలయు మంత్రౌషధ ◆ మర్మకర్మములు
తెలిసితి దేహసి ◆ ద్ధియును సిద్ధించె
నా గురునాథు నా ◆ నతి నెల్ల కడకు
నీగతి భువిఁ జరి ◆ యింపు చున్నాఁడ
నావుడు నన్నర ◆ నాథుండు దేహీ
యేవిధంబున నిల్వ ◆ నెసంగు యోగంబు
తడయ కవ్వలి ఫలి ◆ తంబు లేరీతి
విడుపింపఁగావచ్చు ◆ వివరింపు మనిన
నతఁడును జిరకాల ◆ మధికయోగంబు
ధృతిఁజలుపుట నివ ◆ ర్తించు నాతండు
యోగంబు నడవ లే ◆ కున్నఁ గాలంబు
జాగు కోర్వకయున్న ◆ సయ్యననొండు
తనువుఁ గైకొని మాన్పఁ ◆ దరమగువాని
వినుమది యెట్లంటి ◆ వే నైదుపుట్ల
కొనరఁ [1]గృష్ణాగరు ◆ క్రొత్త తైలంబు
కొని యంతయును నిన్ప ◆ కొప్పెరఁ బోసి
...... ...... ....... ....... ...... ....... ........
యేర్పడఁ బొయిమీఁద ◆ నిడి యనలంబుఁ
గై కొల్ప యుడుకు రాఁ ◆ గాఁగెడి వేళ
వీఁకమైనందుఁ బ ◆ ర్విడి పడనుఱికి
ప్రాణంబు విడిచి రూ ◆ పఱవెచ్చి[2] ముద్ద
యైన యత్తఱి నౌష ◆ ధావలివైవ
ఘన వజ్ర దేహుఁడై ◆ కలిత లావణ్య
వినుత[3] యవ్వనలీల ◆ వెడలి యేతెంచి
యిలకెల్ల నొడయఁడై ◆ యెదు రెందు లేక
బలపరాక్రమముల ◆ భాసిల్లు ననిన
జగతీశుఁ డిట్లనెఁ ◆ జచ్చినవారు
మగుడివచ్చుట వింటి ◆ మా యెన్నఁడైన

  1. కృష్ణాక్రొత్తతైలంబు.
  2. రూపున.
  3. వినుము.