పుట:Navanadhacharitra.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

నవనాథచరిత్ర

మనిన భూసురుఁడు నా ◆ గార్జునుశిష్యు
ననఘయోగమున దే ◆ హమునకు నిత్య
తెసఁగునే యనుటయు ◆ నిట్లనె నాతఁ
డసదృశంబైన యో ◆ గాభ్యాసమహిమఁ
గాయంబునకుఁ జేవ ◆ గలిగి యెప్పుడును
బ్రాయంబు దప్పక ◆ బహు[1] కాలముందు
నిట్టియోగమునీయ ◆ నే కాదుతమ్మి
పట్టియాదిగ నెన్నఁ ◆ బడు దేవతలకు
ననఁగ విప్రుఁడు నాడె ◆ నతనితో యోగి
జనులకు నొకవేళఁ ◆ జచ్చుట గలదొ
కలుగదో యనినఁ బం ◆ కజజకపాల
కలితాస్థి వనమాలి ◆ కావితానముల
నొప్పు మృత్యుంజయు ◆ కొకనికిఁ దప్పఁ
దప్పవన్యులకు ను ◆ త్పత్తినాశంబు
లనవుడు సిద్ధున ◆ కనియె బ్రాహ్మణుఁడు
ఘనమైన యోగంబు ◆ కతమునఁ జావు
గలుగకుండినను యో ◆ గము సల్పుఁగాక
తలకొని మరణంబు ◆ తప్పదంటేని
యనవరతంబు [2]బ్రా ◆ ణావరోధమునఁ
బనుపడి తనువు లం ◆ పటఁ బెట్టనేల
కాలమృత్యువుఁ గెల్వ ◆ గారానివిద్య
లీలీలఁ బదివేలు ◆ నెఱిఁగిన నేమి
మున్నాత్మహానికి ◆ మూలంబుగాక
సన్నుతంబగు విద్య ◆ చాలు నొక్కటియె
నావుడు నవ్విప్రు ◆ నకు సిద్ధుఁ డనియె
వావిరి మును బ్రహ్మ ◆ వ్రాసిన వ్రాఁతఁ
గలుగు నాయువుకంటె ◆ ఘనముగాఁ బ్రతుకు
నలవుఁ గల్పించిన ◆ యది విద్యగాక
ధర నన్యవిద్యలు ◆ [3]తథ్యములగునె
పరికింప ననిన నా ◆ బ్రాహ్మణోత్తముఁడు
యోగమేమరి దేహ ◆ మున్నతినిల్వ

  1. కాలమందునట్టియేగిన నేననై కాదు.
  2. బ్రాహ్మణావిరోధమున.
  3. తధ్యమానములె.