పుట:Navanadhacharitra.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

225

వెఱతుము గోరక్ష ◆ విను మన్న నతఁడు
తెఱఁగొప్పఁ[1]గాఁ బ్రభు ◆ దేవు కిట్లనియె
నతితీవ్రశస్త్రాభి ◆ హతిఁ జావవచ్చు
గతియయ్యెనేని స ◆ ద్గతి యంట దరయ
వండనోర్చునే మున్ను ◆ వాయింపనోర్వ
కుండెడుకడప [2]యీ ◆ కొంకేల నీవు
నిరుపమశక్తిమై ◆ నిర్భరభావ
భరమున ననుమాన ◆ పడక నాతనువుఁ
[3]గొట్టి చూడు మటన్న ◆ గురుగు హేశ్వరుఁడు
పుట్టింపనొంప నే ◆ ర్పులు గలవారు
కడఁగి చంపిన నేమి ◆ కష్టంబు దీనిఁ
గడవనేటికి మాకుఁ ◆ గాదన వీని
కుతుకంబు చెల్లించి ◆ కొట్టెద నతఁడు
మృతుఁడై న నింతకు ◆ మిక్కిలి బలిమి
గలుగు గోరక్షు ని ◆ క్కడ సృజియింతు
నలవుమై నని మది ◆ నాయత్తమొదవ
నడిదంబు దృఢముష్టి ◆ నమరించి కదిసి
వడిఝళిపించి స ◆ త్వంబునం బూని
పెడచేతి పెట్టుగా ◆ బిట్టు వ్రేయుటయు
ఖణిఖణింగున మ్రోఁత ◆ గడలుకొనంగఁ
దనవ్రేటు చేతికెం ◆ తయు బిరుసైన
ననయంబు వెఱగందె ◆ నల్లమప్రభువు
కొండలు గంపించెఁ ◆ గుంభిని వణఁకె
నొండొంట వెస డొల్లె ◆ నురుగండశిలలు
నొడలగోరక్షున ◆ కొకరోమమైనఁ
జెడఁదెగ దేటి వి ◆ చిత్రమోకాని
యప్పుడల్లమప్రభు ◆ వనియె గోరక్ష
కప్పిన మోహంబు ◆ కతమున మాయఁ
గడుఁజూడ వైన నీ ◆ కాయసంసిద్ధి
వడసితి వీవుని ◆ ప్పటి యనువునను
పృథువజ్రశారీర ◆ పిండంబు బలిసి
ప్రథితమౌటకు నిది ◆ పనియయ్యె నేని

  1. ప్రభుదేవరకు నిట్లనియె
  2. యీ క్రొత్తవిధియాలనీవు.
  3. గుంమ్మి.