పుట:Navanadhacharitra.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

215

వరకదంబములశా ◆ వర కదంబముల
వారిజంబుల స్థల ◆ వారిజంబులను
వీరభూజముల సౌ ◆ వీరభూజములఁ
దనరుచులెందును ◆ దనరుచు నెగసి
ఘనకూటముల రాయ ◆ ఘన కూటములను
విరళత్వగతి విర ◆ విరఁ బోవఁజేసి
ధరనొప్పు నమ్మహా ◆ ధరణీధరంబుఁ
గని యానగంబు డ ◆ గ్గఱఁ బ్రవేశించి
మునిజనస్థితి నాద ◆ ముల నుల్లసిల్ల
మొగడలు విరియు త ◆ మ్ముల నగ్గలించు
భుగభుగ[1]మను వల ◆ పులు సూఱలాడి
కొనకొని చనఁజొచ్చి ◆ గురువులువారి
తనువులు విదలించి ◆ దళములయదుటఁ
దళుకొత్తు పూఁదేనెఁ ◆ ద్రావి మదించి
మలసి జుమ్మని మ్రోయు ◆ మధుకరంబులును
గొమరారు గంధపుఁ ◆ గొండ నెత్తములఁ
బ్రమదలీలల మించి ◆ పాడుకన్నియల
నలరించి మెల్లన ◆ నరుదెంచుగాలిఁ
దలలెత్తు నునుఁజిరుఁ ◆ దరఁగ యుయ్యలలఁ
బిరిగొన్నప్రేమలఁ ◆ బ్రియులతోఁగలసి
సరిదూఁగియాడెడు ◆ చక్రవాకములు
మిసమిసమను జిగి ◆ మించువెన్నెలలు
పొసఁగ నెసఁగు బిసం ◆ [2]బులలో సగంబు
మెసఁగి మేనులఁ బెంచి ◆ మేలంబుగొనుచు
రసికులై మెలఁగు మ ◆ రాళదంపతులు
సొలవక జఠరరో ◆ చులు నలుగడలఁ
దళుకుతళుక్కునఁ ◆ దఱుచుగాఁ బొలయ
నెడనెడ వడిఁబుటం ◆ బెగయుచుం బెల్లు
బెడయుచు నొండొంటిఁ ◆ బెనఁగుచుం బెరసి
తండతండంబులై ◆ [3]తమకంబు గొనుచు
నిండారుజలచర ◆ నికరంబుగలిగి
యనిమిషోత్సనకారి ◆ యగు తనవారి

  1. నిగుడునల.
  2. బులులొసగు.
  3. తమరపంబగుచు.