పుట:Navanadhacharitra.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

211

యపుడు గోరక్షుఁడి ◆ ట్లనియె వారలకు
నింక మీరిట నుండి ◆ యేఁగుఁ డొక్కొక్క
వంకగాఁ జరియింప ◆ వలయుఠావులకు
మఱవకుం డాత్మలో ◆ మన గురుస్వామి
యొఱపుగాఁ గఱపిన ◆ యుపదేశ సరణి
నేలీలఁ బనిలేని ◆ యెడలఁ జేయకుఁడు
కాలయాపన మని ◆ క్రమమున నిలిపి
యనుపమలాటగౌ ◆ ళాభీర భోట
జనపదంబులకుఁ దాఁ ◆ జనియెఁ బెంపొదవ
నరిగెఁ గళింగవం ◆ గాంగభూములకు
నరనుతుండగు మేఘ ◆ నాథుఁ డిం పెసఁగ
మఱియు మహారాష్ట్ర ◆ మ[1]హా దేశములకు
భూరితేజుఁడు సిద్ధ ◆ బుద్ధుఁడు పోయె
నెలమి విరూపాక్షుఁ ◆ డేఁగెఁ గర్ణాట
లలిత కన్నోజిమా ◆ ళవ దేశములకు
నూర్జిత యశుఁడు సొం ◆ పొదవఁ గాశ్మీర
ఘూర్జటేంకణ మత్స్య ◆ కోంకణంబులకుఁ
గలిత ప్రభావుండు ◆ ఖణికుండు నరిగె
మళయాళ బర్బర ◆ మగథాంధ్ర పాండ్య
చోళభూములు చనఁ ◆ జొచ్చె విజ్ఞాన
శీలి నాగార్జున ◆ సిద్ధుఁ డింపార
నీరీతి నందఱు ◆ నెల్ల దిక్కులకు
ధీరులై చని మున్ను ◆ తిరిగిన ఠావు
లనక వెండియు చతు ◆ రబ్ధి [2]మధ్యమున
వినఁజూడ వసియింప ◆ విస్మయకరము
లగు తీర్థములను దే ◆ వాలయంబులను
దగుపురంబులఁ బర్వ ◆ తగహనంబులను
మెలఁగుచు గురుబుద్ధి ◆ మెఱసి సజ్జనులఁ
దెలిసి మానస్థితిఁ ◆ దెలుపుచు దీక్ష
లొసఁగి సిద్ధులఁ జేసి ◆ రుర్విఁ బెక్కండ్ర
నసమానమహిమ వా ◆ రది యెవ్వ రనినఁ
బండిత ప్రవర స ◆ ద్వాది గోరక్ష

  1. ఇట్టిప్రయోగములు శైవకవిత్వమునఁ బ్రసిద్ధములు.
  2. వలయమున.