పుట:Navanadhacharitra.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

187

నులిగడియంబులు ◆ నూపురంబులును
కనకఘంటలును మూ ◆ గలును గజ్జలును
దనరు [1]మేఖల కటి ◆ స్థలి నలవడఁగ
ముద్దులార్పెడిపట్టి ◆ ముదమొప్పఁ దెచ్చి
యద్దివ్యయోగీంద్రుఁ ◆ డా శిష్యునకును
జూపి యక్కునఁ జేర్చి ◆ చుంచుదువ్వుచును
దీపు లుట్టఁగ వాని ◆ తెలివియు రూపుఁ
బలుమాఱు నంకించి ◆ పలికెడు గురునిఁ
దలఁపక గోరక్షు ◆ దగను నిట్లనియె
మును శుక్ల శోషితం ◆ బులు ముద్దగట్టి
ఘనసాపరతలైన ◆ కాంతల యుదర
ములఁ జాల మలమూత్ర ◆ మునను నుప్పొంగి
[2]నెలలు గా నేహ్యపు ◆ నెలవులం బుట్టి
నీరుబుగ్గలభంగి ◆ నిమిషమాత్రమున
భోరున రూపఱి ◆ పోయెడి వీరు
సుతులె భవత్కృపా ◆ సుధపొడవైన
మతిసిద్ధదేహుల ◆ మగు నేము గాక
యెందును నిల్వక ◆ యేగెడు నిట్టి
బొందికై విభ్రాంతిఁ ◆ బొరల నేమిటికి
నావుడు గోరక్షు ◆ నకు నిట్టు లనియె
నావరయోగీంద్రుఁ ◆ డకట రోఁతనుచు
ననియెదు మొదలు నే ◆ యనువున నీవు
జననంబు నొందితి ◆ సకలదేహులును
నీగతినే పుట్ట ◆ నెఱిఁగి నీకింత
[3]తీగఁదెంపఁగ నేల ◆ దీనఁగుమార
యను గురునాధుతో .◆నఱుక్రమ్మి మరియు
ననియె గోరక్షుఁ డి ◆ ట్లవధరింపంగ
నేల సర్వేశ్వరుఁ ◆ డీ జగంబాత్మ
లీలకై మొదలఁ గ ◆ ల్పించెడి కొఱకు
నమరించినట్టి మి ◆ థ్యా భ్రాంతిగానఁ
దమసొమ్మనుచుఁ జిచ్చు. ◆ దఱిఁ బట్టరాదు
తక్కిన వేమియు ◆ దాఁచినఁ బోవు

  1. మొలకట్టుకటి.
  2. నీలమై.
  3. తెగతెంపగా నేల.