పుట:Navanadhacharitra.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

నవనాథచరిత్ర

...... ...... ...... ...... ...... ...... ....... ......
బరితోషితునిఁ జేసి ◆ పరమానురాగ
భరితుఁడై రాజ్య వై ◆ భవముల దృష్టి
పురికొనఁ దొల్లిటి ◆ భూపాల సతులఁ
బరకాంత లని మాని ◆ భావజ్ఞు డెలమిఁ
బాటించు మోహన ◆ బాణంబు లట్టి
పాటలగంధులఁ ◆ [1]బన్నిరువురను
రమణతో నెంతయు ◆ రమణీయలైన
రమణికా దేవియు ◆ రత్నావళియును[2]
సౌమ్యాంగియుసు [3]బుష్ప ◆ సంపూర్ణ గంధి
రమ్యవిభ్రమయును ◆ రాజాననయును
జిత్రరూపికయును ◆ శీతావతియును
జిత్రభామినియును ◆ శ్రీగంధికయును
సొనర దాక్షాయణి ◆ శుభలక్షణయును
ననువారిఁ బరిణయం ◆ బై వారి పేర
బారహకన్యక ◆ పట్టణం బొకటి
ధారుణీస్థలిఁ బ్రసి ◆ ద్ధముగఁ గట్టించి
వారినందఱ నుంచి ◆ వరచిత్రవస్త్ర
చారు భూషణ పుష్ప ◆ చందనాదులను
జాల నింపెసఁగుచు ◆ జాతి సత్వములు
పోలఁగఁ గళలుండు ◆ పొందు మేలెఱిఁగి
యనుకూల రతికేళి ◆ నందంద నేర్పు
లొనరఁగ్రీడింపుచు ◆ నొక్కొక యెడలఁ
గడువేడ్క గజతురం ◆ గంబుల నెక్కుఁ
దొడిగి పూసియు కట్టి ◆ తుంటవి ల్తొప్పు
నసియాడు నడుములు ◆ నలసయానములు
రసమొల్కు బింబాధ ◆ రంబుఁ గ్రిక్కిఱిసి
....... ....... ....... ........ ...... ....... ....... ......
యొండొంటితో రాయు ◆ చున్న చన్నులును
గల వారసతులు డ ◆ గ్గఱి కుంచె లిడఁగఁ
గొలువుండి దిట్టయై ◆ కొండొక తడవు
మల్లులఁ బోరించు ◆ మధువేళ లీలఁ

  1. పదినూరువురును.
  2. రత్నావతియును రమణికెయును రత్నా.
  3. బ్రనవ.