పుట:Navanadhacharitra.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

179

మేటి వాద్యంబులు ◆ మిన్నంది మ్రోయఁ
బాటించి కనక కుం ◆ భంబులు నిలిపి
మకుటతోరణములు ◆ మణితోరణములు
ముకురతోరణములు ◆ ముదమొప్పఁ గట్టి
తఱచుగాఁ జిత్రప ◆ తాకముల్ నిలిపి
మెఱయుగలపడముల్ ◆ మెచ్చుగాఁ గట్టి
మహనీయమగు శివ ◆ మందిరంబులను
బహురత్నదీపికా ◆ పఙ్త్కులునించి
యాడెడి పాడెడి ◆ యట్టి వారలకు
...... ...... ...... ....... ....... ....... ......
భాసుర మణిమయా ◆ భరణసువస్త్ర
గోసువర్ణాదులు ◆ కొండుకొం డనుచు
వసుధామరుల కిచ్చు ◆ వారిఁ గారుణ్య
మెసఁగ బ్రాహ్మణముఖ్య ◆ మేధ్య జనాది
సమితికిఁ బాయస ◆ శర్కరాపూప
నుమహీతదధిమధు ◆ సూపాజ్యశాక
సరసఫలోపేత ◆ శాల్యోదనములు
వరుసఁ దృప్తిగఁ బెట్టు ◆ వారల నంత
నారాజ శేఖరుఁ ◆ డందఱఁజూచి
వీ రిట్టివారని ◆ వివరింపలేక
యూరకె మాటాడ ◆ కున్న నూహించి
యీ రోగమహిమచే ◆ నిట్టి విభ్రాంతి
[1]పరిగొనె నృపునని ◆ బంధువుల్ హితులు
[2]వరుస మీఱఁగ వైద్య ◆ వరుల నందఱను
మసలక రప్పించి ◆ మందు పెట్టించి
నుసరమై తెలివొందు ◆ చొప్పులేకున్న
భూవరుమంత్రిప్ర ◆ బుద్ధుఁడా తెఱఁగు
భావించి యెవ్వఁడో ◆ పరమయోగీంద్రుఁ
డేపారఁ దన యాత్మ ◆ నీరాజు బొంది
లోపల నిలిపెనో ◆ లోఁ గానవలయు
ధీయుక్తి నితనికిఁ ◆ దెలిపి రాజ్యంబుఁ
జేయింపవలెఁ బూర్వ ◆ శారీరిగాను

  1. బలిశనె నృపుడని.
  2. నరులుమీరిన విప్రవరులు నందరును.