పుట:Navanadhacharitra.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

175

డీ మూర్ఖుతనము నీ ◆ కేటికి నొదవె
బలియుకోపంబు పా ◆ పమునకుఁ దెరువు
కలఁగుఁ జిత్తము దాన ◆ గాసియౌఁ దపము
తపసికి శాంతంబు ◆ దయయు ధర్మంబుఁ
గృపయును దగుఁ గాక ◆ కినుక మే లగునె
మున్ను విశ్వామిత్ర ◆ మునియును నిట్ల
పన్నిన కింక ద ◆ పమును బోనాడె
నని పల్కుటయు నమ్మ ◆ హాత్మునితోడ
ననువుగా నాగార్జు ◆ [1]నఁడు చెప్పినట్లు
తన పూర్వవృత్త మం ◆ తయు నొప్పఁజెప్పి
వినుతించుటయు మోము ◆ వికసిల్ల నతని
దాయ రమ్మని పిల్చి ◆ తపముపైఁ బ్రేమఁ
జేయుము నీకును ◆ సిద్ధత్వ మేల
చనదు పొమ్మనిన నా ◆ సంయమీశ్వరుఁడు
మనమార నిట్లనె ◆ మత్స్యేంద్రుతోడఁ
గూరలు వేళ్లును ◆ గూడుగాఁ గుడిచి
నారచీరలు గట్టి ◆ నట్టడవందు.
నుపవాసములఁ గ్రుస్సి ◆ యోరంత ప్రొద్దు
జపములు సలుపుచు ◆ జలముల నడుమఁ
జలికాలమునను వే ◆ సవి బలుమంట
లలము పంచాగ్ని మ ◆ ధ్యంబున మరియు
వానఁ దొప్పఁగఁ దోఁగి ◆ వణఁకుచు బయటఁ
బూని తపంబు స ◆ ల్పుట సాలఁగడిఁది
చాలు తపఃఫల ◆ చర్చ నీపాద
నాళికాయుగ సేవ ◆ నాకు సిద్ధించె
నింటిముంగటను బా ◆ లేఱుండ గుంట
వెంటఁ బాఱెడు నట్టి ◆ వీఱిఁడి గలఁడె
యని చాఁగిమ్రొక్కిన ◆ నమ్మహాయోగి
తన శిష్యవరుల నం ◆ దఱను వీక్షించి
తెఱఁగొప్ప నిమ్ముని ◆ దీక్ష యెట్లనుచుఁ
దరమిడి యేమి చే ◆ తము దీని కనిన

  1. డుజ్జునకుఁ బూర్వముత్వము రాకపోవుట సంజ్ఞావాచకములలోఁ బ్రాయికముగాఁ గనఁబడుచున్నది.