పుట:Navanadhacharitra.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

119

భయవిముక్తునిఁ జేసి ◆ బ్రతికింతు ననుచుఁ
దొ వృద్ధవిప్రుఁడై ◆ ధన్వంతరియును
వేవేగ వచ్చి యా ◆ విటపిమూలమునఁ
జేరిన నతని వీ ◆ క్షించి తక్షకుఁడు
[1]ఈరెవ్వ రిచటికి ◆ నేల వచ్చితిరి
నావుడు తక్షక ◆ నాగేంద్రుచేతఁ
జావకయుండ నా◆ [2]సంజీవశక్తిఁ
జూపి యాభద్రాత్మ ◆ జునిఁ గావజనెద
నా పేరు వినుము ధ ◆ న్వంతరి యనిన
నేనె తక్షకుఁడ నీ ◆ వెట్లు రక్షింపఁ
బూనెదు మద్విష ◆ [3]పూర్ణ దంష్ట్రలను
గఱచెద భస్మంబు ◆ గాను నీ పటము
నుఱక ము న్నున్నట్టు ◆ లుండఁ జేసెదవె
చూచెదఁగాక నీ ◆ చోద్యంబు ననుచు
నేచి నిజాకార ◆ మేర్పడఁ బెరిఁగి
విలయకాలానల ◆ విష ఫణిజ్వాల
చలదుగ్రజిహ్వావి ◆ శాలఫణంబు
కుఱుచగా [4]నోరకు ◆ గోడించి యొడిసి
కఱచిన గొబ్బునఁ ◆ గ్రమ్ము విషాగ్ని
పటలంబుచే భగ ◆ భగఁ గాలి పడిన
వటుతర వటతరు ◆ భస్మపుంజంబుఁ
జేరి సంజీవని ◆ సిద్ధమంత్రముల
నీర మాక్షణమె మం ◆ త్రించి చల్లినను
బసిడాలు నాకుజొం ◆ పములతో నొప్పి
యెసఁగుకొమ్మలతోడ ◆ నింద్రగోపముల
బాగునఁ బెంపారు ◆ ఫలములతోడఁ
దూఁగుశాఖలలోనఁ ◆ దొలఁకులయందు
నెలకొను బహుపక్షి ◆ నివహంబుతోడ
నలఁగకదానిపై ◆ నటనున్నయంత
యున్నతితోఁగూడ ◆ నుప్పరంబెగసి
పన్నుగఁబాదునఁ ◆ బడి విలసిల్లు
వృక్షంబుగనుగొని ◆ వెఱఁగంది నిలిచి

  1. మీ రెవ్వ.
  2. స్మరమంత్రశక్తి.
  3. వూరసిదడ్గు.
  4. కుఱుచగాజొర మొగ్గాణించి యొడసి.