పుట:Navanadhacharitra.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

117

పెనుపున వేళ్లతోఁ ◆ బెకలి తోయముల
మునిఁగి క్రమ్మఱఁదేలి ◆ మున్నున్నయట్టి
కుదురునఁబడిన యా◆ కుజముఁజౌరంగి
ముదమారఁజూపి చె ◆ ప్పుచు నున్న వేళ
విచ్చిన పడగలు ◆ వెలికి లోపలికి
వచ్చుజిహ్వలు విష ◆ వహ్నిధూమములు
నిగుడు హుంకృతులును ◆ నిడుదవాలమును
జిగిమించు పొడలును ◆ జిఱునిప్పు లురులు
గన్నులుఁ గెంపారు ◆ కంఠముల్ తలల
నన్నిటమెఱయు క ◆ ట్టాణిమణులును
గలిగి గరంటక ◆ ఘర్ఘరధ్వాన
మొలయ నయ్యురగేంద్రుఁ ◆ డొయ్యన నచ్చి
మడుఁగు డగ్గఱ విని ◆ ర్మల నలిలంబు
కడుపారఁగ్రోలి ము ◆ ఖంబు నిక్కించి
చేరి యా[1]పైన నా ◆ సీనులైయున్న
వారలలోనఁబూ ◆ ర్వము గనుంగొన్న
చౌరంగి వీక్షించి ◆ చయ్యన నేగి
కోరి తా మును సమ ◆ కూర్చినయట్టి
భవ్య ప్రభావసం ◆ పదఁ జెప్పమీఱు
దివ్యౌషధంబులఁ ◆ దెచ్చి సద్భక్తి
మెఱయఁ గానుక లిచ్చి ◆ మీననాథునకు
నెఱిఁగి త్రిలోకైక ◆ హితపుణ్యచరిత
పరమకృపాలోల ◆ భక్తానుపాల
దురితవిదూర బం ◆ ధురశుభాకార
పరమేశవరపుత్ర ◆ భవలతాదాత్ర
[2]నిరుపమశాంతాత్మ ◆ నిర్మలచ్ఛాత్ర
వారక నీమహ ◆ త్వము మున్ను వినియు
భూరితేజః స్ఫూర్తిఁ ◆ బొలయు ని న్నిపుడు
కనియు నాకన్నులు ◆ గల ఫలంబెల్ల
నొనరఁ గాంచినఁ బాసె ◆ నురుశాపదుఃఖ
మనుచు నప్పుడు భుజం ◆ గాకృతి మాని

  1. పైననాసీనులై యున్న అనియే వ్రాతప్రతి పాఠము.
  2. నిరుపమశాంత నిర్మల