పుట:Navanadhacharitra.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

113

సుతు నాజ్ఞ పెట్టించ్చి ◆ [1]సురసుర వెచ్చి
మతితప్పి తేజంబు ◆ (మాలి యావెన్క)
నంతకగోచరుం ◆ డయినఁదదీయ
సంతతియందు రా ◆ జ్యము నిస్తరించఁ
గలవార లెవ్వరుఁ ◆ గలుగమిఁజేసి
యలకక సామంతు ◆ లగు బలవంతు
లోక్కొక దుర్గంబు ◆ (నొగినాక్రమించి)
పెక్కుభంగులఁ బ్రజా ◆ పీడ యొనర్పఁ
గనుకని వారు నల్ ◆ గడ విచ్చి పఱవ
జనశూన్య మయ్యెఁ ద ◆ జ్జనపదం బెల్ల
నతనిభాండారము ◆ నాలమందలును
బ్రతిలేని గజములు ◆ బహుతురంగములుఁ
గణఁజంబు లాదిగాఁ ◆ గలుగు సంపదలు
గణుతింపఁజోద్యంబు ◆ గాఁగ నెచ్చోటి
వచ్చోట నణఁగె ము ◆ న్నటఁ బశుపాలుఁ
జెచ్చెరఁగానన ◆ సీమయందెల్ల
వెదకి కానక తోడి ◆ [2]వ్రేలును వగల
నదవదఁ బొందుచు ◆ నంత నత్యుగ్ర
మృగములు మెసఁగి చం ◆ పెనకాఁ దలంచి
మగిడి యేగిరి తమ ◆ మందల కచటఁ
గదలక మరికొంత ◆ కాలంబు చనఁగఁ
దుది మును మీన నా ◆ థుండు సమాధిఁ
దెలిసి తాఁ జౌరంగి ◆ దెలిపి గోరక్షుఁ
[3]దెలుపు నీ వన గ ను ◆ స్థితి నాతఁడట్ల
గావించె నిద్ర మే ◆ ల్కనినచందమున
నావల్లవోత్తముఁ ◆ డల్లనకన్ను
గవవిచ్చి పెద్దయుఁ ◆ గాలంబు కణఁక
...... ...... ....... ....... ....... ....... .......
....... ....... ....... ....... ....... ....... .......
వికసింపఁ జేసి వా ◆ విరి గురుస్వామిఁ
గనుఁగొని నేవచ్చి ◆ కడుతడ వయ్యెఁ
బనివినియెద నన్నుఁ ◆ బనువు మందలకుఁ

  1. యునుజాల వెచ్చి
  2. పెయ్యలు.
  3. దెలుపునీవని సుస్థితిని మీననాధుడెల్ల .