పుట:Navanadhacharitra.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

నవనాథచరిత్ర

దూరంబు వాసనా ◆ తులితపానీయ
పూరంబు పుష్పిత ◆ భూరు హోదార
తీరంబు నుల్లస ◆ ద్వీచి వితాన
సారంబు నైనకా ◆ సారంబుఁ గనియెఁ
[1]గని మనంబునఁ గౌతు ◆ కంబు సిద్ధింపఁ
జనఁజొచ్చి చయ్యనఁ ◆ జౌరంగి పాణి
కమలపుటంబునఁ ◆ గమలముల్ నించి
తిమిరికొన్నను దప్పి ◆ తీఱకయున్నఁ
దనుఁ బొడగాంచిన ◆ దవ్వులఁ దొలఁగి
చనుమృగపక్షి సం ◆ చయము వీక్షించి
యరుగుచు నంత స ◆ హ[2]కరభూజంబు
చలిత శాఖోచ్ఛాయ ◆ జడిగొను చున్న
సైకతస్థలిఁ బథి ◆ శ్రమ మెల్ల దీఱఁ
జేకొని శయనించి ◆ చిత్తంబు నలర
నంచితలీల శా ◆ ఖాగ్రంబు లందు
సంచరించెడి శుక ◆ శారికా బర్హి
కలపిక కలకంఠ ◆ కలకలధ్వనులు
పలుమాఱు వీనుల ◆ పండువై పొలయ
వినుచు సుఖంబున్న ◆ వేళ నహీంద్రుఁ
డొనర నచ్చటి కొక్క. ◆ డొయ్యన వచ్చి
తీరపాదప మెక్కి ◆ తిరముగా దాని
తోరంపు గొమ్మలఁ ◆ దోఁకఁదాఁ జుట్టి
జలపానతృష్ణ నా ◆ సరసీలోపలికిఁ
దల చాచి తోయంబు ◆ త్రాగునయ్యెడను
నెగ డందులోనుండి ◆ నిగిడి యాపాము
దగులఁబట్టిన నది ◆ తల్లడపడఁగ
సుదగొమ్ముతోనంటఁ ◆ జుట్టినతోఁక
వదలక తివుపాము ◆ వడిమీఁద నెగడు
కడిమిమైఁ దివియవృ ◆ క్షము వేళ్లతోడఁ
దొడిఁబడఁ బెకలి త ◆ త్తోయంబులందు
భోరున బుగ్గలు ◆ వొడమంగ మునిఁగె

  1. ఇటనన్వయము సరిగానెయున్నది కాని యొకపాదము లుప్తమైనట్లున్నది.
  2. సహకార భూజంబు జరిత ...జెలి.