పుట:Navanadhacharitra.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

101

దక్షత ని న్నె కా ◆ తలఁ చెద ననుచు
నొదవు శోకము నిల్ప ◆ నోపక మఱియు
[1]నదవదపడుచు ని ◆ ట్లనియెఁ జౌరంగి
మఱువక గురునాథు ◆ మాఱుగా నిన్ను
నఱ లేక తలఁపుదు ◆ ననవరతంబు
లేదు నాయెడఁదప్పు ◆ లేశమాత్రంబు
మోదంబు మీఱ నే ◆ మును చేసినట్టి
పొరపేమి యని చిన్నఁ ◆ బోయిన మోముఁ
దొరఁగు భాష్పములుపైఁ ◆ దొరఁగ గోపకుఁడు
విసిఁగి చౌరంగిని ◆ వెదకుట మాని
మసలక చనియుఁ దా ◆ మందలోపలికి
గోపాలకులఁ బిల్చి ◆ గోవులమందఁ
జూపి యప్పనఁజేసి ◆ స్రుక్కక చావ
సమకట్టియుఁ గడు వి ◆ సర్జించి జాలిఁ
గుములుచుఁ దానుండు ◆ గుడిసెలోపలను
నించుక కను మూయు ◆ నెడ మీననాథు
డంచితంబుగఁ గల ◆ నరుదెంచి పలికెఁ
జావ నేటికిఁ బుత్త్ర ◆ చౌరంగి వచ్చె
నూవసించిన యట్టి ◆ మాల్యవంతమున
కనిన మేల్కని గురుఁ ◆ గని వెఱఁగంది
తనమది నిల్పి స ◆ ద్భక్తితో మ్రొక్కి
మఱునాఁడు తాఁ జని ◆ మత్స్యనాథుండు
గుఱుకొని వసియించు ◆ గుహవాత నిండఁ
బెనురాళ్లఁ దెట్టెగాఁ ◆ బెట్టి చాలించి
చనక నిశ్చలభ క్తిఁ ◆ జనుదెంచి యరసి
పోవుచు నిహపరం ◆ బుల శ్రీ గురుండు
దైవంబు భావింపఁ ◆ దన కనుచుండె
నంతఁ జౌరంగియు ◆ [2]నమ్మాల్యవంత
చెంతను వడ యెండ ◆ చే దప్పి గదిసి
వెరవార జలములు ◆ వెదకుచుఁ బోయి
సరసిజ కుముద వి ◆ స్తారంబు చక్ర
సౌరస హంస ప్ర ◆ చారంబు పంక

  1. నెదవడి:-- నిట్లని.
  2. గియుమాల్య వంతంబు చేరువ యెండవడచే.