పుట:Navanadhacharitra.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

నవనాథచరిత్ర

బరిమళంబులు గ్రోల ◆ భ్రమయించు మధుప
గరుదంచలంబులఁ ◆ గడలెత్తి సన్న
గరువలి వీవంగ ◆ ఘనదీర్ఘికలను
దరఁగలన్ తూలికా ◆ తల్పముల్ గ్రాల
మెలఁగెఁ జిల్లనిగాలి ◆ మేడలమీఁద
నిలువున నొప్పు వె ◆ న్నెలలబయళ్లఁ
దగుహంస తూలికా ◆ తల్పంబునందుఁ
జిగురాకు బోణుల ◆ జిగిమించుచున్న
యురములు దాఁకొని ◆ యొత్తి యొండొరుల
కరదండములు దల ◆ గడల నమర్చి
ధమ్మిల్ల బంధంబు ◆ తగ వీడుపడఁగఁ
దమ్మలంబులచొక్కు ◆ తడఁబడఁ గలసి
విలసిల్లు నెరజాణ ◆ విటుల గుండియలు
ఝళుకెక్కఁ దూరుపు ◆ జాయ గెంపెక్కి
లాగుగాఁ దీర్చిన ◆ లత్తుక రేఖ
బాగున జిగిమించు ◆ పవడంపుఁ దీగె
జోక జేగురుపట్టె ◆ [1]సొబగునరాగి
రేకుచందమున [2]చెం ◆ ద్రికనింపుబరణి
మూఁకుడు విధమున ◆ ..... ..... ..... ......
..... ...... ...... ...... ...... ◆ మురువునరాము.
గండగొడ్డలి లీలఁ ◆ గ్రమమున నాత్మ
మండలం బెసఁగఁగ ◆ మర్త్యు లింద్రునకుఁ
జారువైభవలీల ◆ సమకొనఁ జేరి
కోరి పట్టిన తోఁపు ◆ గొడుగన మఱియు,
శ్రీ సొంపుమీఱ శ ◆ చీదేవి చెవిని
భాసిల్లు కెంపుల ◆ పసిఁడి యాకనఁగ
నలిగి యసురులవై ◆ [3]నదిమిపట్టియును
జలశాయి వేసిన ◆ చక్రమో యనఁగ
మలహరు కుడికన్ను ◆ మహిమలచెన్ను
కలువలపెంపు జ ◆ క్కవలకు సొంపు
వ్రతముల చేవ కై ◆ వల్యంబు త్రోవ
క్రతువులయొప్పు చీ ◆ కటిమూఁక విప్పు

  1. సొబగునపరంజి
  2. చంద్రంపుబరణి.
  3. మీదలిమినట్టియును.