పుట:Navanadhacharitra.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65

బసిఁడి కోఱలనుంచి ◆ బహుమాన మొదవఁ
బొసఁగఁ గర్పూర తాం ◆ బూలమ్ము లొసఁగి
బొండన్న వారును ◆ బోయి యారాజు
దండ ప్రణామంబు ◆ తగ నాచరింప
వలనొప్పఁ గాఁబోయి ◆ వచ్చిన[1] తెఱఁగు
వెలఁదిగా నంతయు ◆ వినిపింపఁ గోరి
అవధారు! విన్నపం ◆ బవనీశ తిలక
తివిరి దేవరయాన ◆ [2]తిక్రమంబునను
జని యథోచితగతి ◆ సారంగధరునిఁ
గనుఁగొని మానేర్చు ◆ క్రమముల నెల్ల
నడుగఁ గలంతయు ◆ నడిగితి మేము
కడుఁబుణ్యుఁడౌఁ గాని ◆ కల్లరి గాఁడు
తిరముగా దేవ భూ ◆ దేవ సన్నిధిని
[3]బరిసెనంబున దిబ్బఁ ◆ బట్టించి గాని
యొండు విచారంబు ◆ లూహింపఁ గాదు
మండలాధీశ్వర ◆ మఱియు నే మతనిఁ
దఱిమి నే మింకఁ ద ◆ థ్యము చెప్పుమనిన
నఱమరలేక చి ◆ త్రాంగి నీమాట
ధట్టించి యడిగిన ◆ ధరణీశు తోడఁ
గట్టిగాఁ జెప్పెడిఁ ◆ గాన పొం డనియె
నావుడు వారి నం ◆ దఱఁ దోడుకొనుచు
భూవరుఁ డపు డంతి ◆ పురమున కేగి
కనుఁగొని శయ్య డి ◆ గ్గన డిగ్గి యచట
నొనర హేమస్తంభ ◆ మూఁతగా నిలిచి
ముసుఁగు డగ్గఱఁ దిగిచి ◆ ముగుద చందమున
వసివాళ్లు వాడుచు ◆ వదనంబు పంచి
కాటుకకన్నీరు ◆ కడగోర దిద్ది
మీటుచు నున్న యా ◆ మెలఁతుకఁ గదిసి
యవనీశు ననుమతి ◆ నాదొరల్ చేరి
ధనళాక్షి సారంగ ◆ ధరుఁడు నేఁ డిటకుఁ
బారావతంబునె ◆ పంబున వచ్చి

  1. తెఱంగెల్ల.
  2. 'ఆనతి ' శబ్దము సంస్కృత మనుభ్రాంతిచేఁగవి ప్రయోగించి యుండును.
  3. బరిసెనంబుగ.