పుట:Narayana Rao Novel.djvu/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
83
వీణ

కోసం, ఉదరపూజకోసం ఆలోచిస్తూకూర్చోడానికి వాళ్లకు వీలుపడదు. నిద్రహారాలు కూడా మాని, దీక్షతో పనిచేసే మానవుడికి కామవిషయం కలలోకి గూడ రాదుగదా! అయితే ప్రజోత్పత్తిమూలకమైన కామం కూడా పురుషార్ధమే కనక, దాన్ని బొత్తిగా వదలి పెట్టనక్కరలేని సామాన్యగృహస్థులంతా, ఒక స్త్రీతోనే కామనిర్వహణం చేస్తూ, యితరపనులు చేసుకోడానికి మనశ్శాంతీ, తీరికా సంపాదించుకుంటారు. అంతే కాని స్త్రీ, పురుషులు స్వేచ్ఛాచారపరులయి నిరంతరం సంఘసుస్థితికి భంగంకల్గించే కొట్లాటలు తెచ్చి పెట్టుకోగోరరు’

‘ఒక స్త్రీతో వుండాలని నేను వొప్పుకుంటాగాని వివాహ కర్మకాండంతా ఎందుకు?’

‘ఆ మాటన్నావు, బాగుంది. జాతి క్షేమానికి, సంఘ సుస్థితికీ ఒక పురుషుడూ ఒక స్త్రీయే కూడివుండడం అవసరమని ఒప్పుకుంటే నాకు చాలు. వివాహకర్మ మానుకొన్నా నాకు సమ్మతమే.

‘మఱి ఎందుకు చేస్తున్నారందరూ యీ కర్మను?’

‘అది వేఱే సంగతి. వివాహం అర్థకామాలకే కాకండా, ధర్మమోక్షాలకు గూడా సాధనమని నమ్మేవారు ఆ పని చేస్తారు. వాళ్ల జోలి నీకెందుకు? తానుతప్ప యితరం లేదంటూ, ఆత్మాభిమానంతో మ్రగ్గేవాడికి గృహస్థాశ్రమం ఆత్మసాధన. తన చుట్టూ తాను కట్టుకొన్న గిరిని ఆలుబిడ్డలద్వారా విస్తరింప జేసుకొని, క్రమంగా విశ్వంతో ఐక్యభావం సాధించుకొంటాడు. గృహ్య సూత్రోక్తమైన కర్మలు సర్వభూత దయాళుత్వం మొదలైన ఉన్నత భావాలకు మెట్లవంటివి. ఇది అంతా మతానికీ, దేవుడికీ సంబంధించిన విషయం. నువ్విదంతా వేదాంతమంటావు. కాబట్టి ఆ సంగతి మనకు వద్దు.’

‘వివాహకర్మ అక్కరలేదంటే మనకిక తగాదా లేదు.’

‘లేకేమి? మీ స్వేచ్ఛాచారులు ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే నిబంధన ఒప్పుకోరుగా? మోజు తీరిపోగానే యెవరిదారి వారు చూచుకోవలసిందనేగా మీ మతం?’

‘అవును గాని, స్త్రీకిగూడ స్వతంత్రం అనేది వుంటే మేము చెప్పేస్థితి వస్తుందా, రాదా?’

‘ఆ స్థితికి కారణం స్త్రీ, స్వాతంత్య్రం అవునో కాదోగాని, ఆ స్థితి మాత్రం అధోగతికి కారణమవుతుంది. జడ్జి లిండ్ సే అమెరికా స్థితి వ్రాశాడు. చూడలేదూ? విడాకులు పుచ్చుకోడానికి స్త్రీ కీ పురుషుడికీ సమానస్వాతంత్య్రం వున్న సోవియట్ రష్యాలో, అమెరికాకంటే తక్కువ విడాకుల సంఖ్య. విన్నావో, లేదో? కాబట్టి స్త్రీ, స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నీతి నియమాలనేవి వుంటే ధర్మరతి అనేది వుంటే నువ్వనుకొనేస్థితి యెన్నడూ సంభవించదు. ఆహారనిద్రామైధునాలకొఱకే మనం బ్రతుకుతున్నామనుకొంటే మాత్రం ఆ స్థితి