పుట:Narayana Rao Novel.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంజలి

ఈ నవల ఉద్భవించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయమువారు కారకులు. వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు.

ఈ నవలారచనలో నాకు ఉత్సాహం కలిగించిన నా ప్రాణ మిత్రులు డాక్టరు చెన్నాప్రగడ సుబ్బారావు, ముష్టి లక్ష్మీ నారాయణ, ములుకుట్ల సుబ్బారాయుడు, మంచాళ జగన్నాథ రావు, కాళీపట్నపు శేష శాయిగార్లకు నా ప్రేమాంజలులు.

ఈ కావ్యాన్ని సరిచూచిన ప్రజ్ఞామూర్తి, మిత్రుడు కాటూరి వేంకటేశ్వరునికి నమస్కారాలు.

ఈ నాకృతిని ప్రథమంలో తమ దినపత్రికలో ప్రచురించిన ఆంధ్రపత్రికాధిపతులకు ఎంతయో కృతజ్ఞుణ్ణి.

ఇది అచ్చు వేయించుటలో నాకు వేవిధాల సహాయం చేసిన మిత్రులు, యువకులు పెనుమర్తి కామేశ్వర రాయనికి, తెలికిచర్ల వెంకటరత్నంగారికి, మాధవపెద్దికవికి, మారిన సుబ్బారావుగారికి, కలగర నాగభూషణం చౌదరిగారికి, శ్రీ శివలెంక శంభుప్రసాద్ గారికి నా నమస్సులు,

ఈ నవలను ఒకనాడు పాఠ్యగ్రంథముగా నిర్ణయించిన ఆంధ్ర, చెన్నపురి విశ్వవిద్యాలయాధికారుల ప్రోత్సాహోపకారముల కెంతయు కృతజ్ఞుడను.


అడివి బాపిరాజు