పుట:Narayana Rao Novel.djvu/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
37
రా య బా రం

శ్రీరా: ఆనందరావు గారూ నేను ‘లా’ కాలేజీలో ఒక్కసారే చదువుకున్నాం. ఇన్నాళ్ళకు వారు మా యింటికి విచ్చేసి, మా ఆతిథ్యం అంగీకరించే భాగ్యం మాకు కలిగింది.

డి. త.: అల్లా అనకండి. ముందర మా ఇంటిలోకి ఏర్పాటులన్నీ అయినాయి. వారు మీ యింటికి రావడానికి చాలా అభ్యంతరాలున్నాయండో శ్రీరామమూర్తి గారూ!

ఇంతలో ఊరిలోని పెద్దలు నలుగురు నాహూతులయివచ్చి, యథోచితాసనముల నధివసించిరి.

ఆనం: మా మామయ్య గారు, వారి ద్వితీయ పుత్రిక ను తమ ద్వితీయ పుత్రున కిచ్చి వివాహం చేయ సంకల్పించుకుని మమ్ముల నందరిని తమ్ము ప్రార్థించుటకై పంపినారు. తమరు ఆమోదించవలెనని మేమంతా కోరుతున్నాము. వారి కోర్కెను పాలించవలసిందని మనవి.

సుబ్బా: చిత్తం. ఎంతమాట! వారు జమిందారులు. మేము సామాన్య గృహస్థులం. ఆగర్భ శ్రీమంతుల పిల్లను నా కుఱ్ఱవానికి ఇస్తామని మీరయితే అనుగ్రహించినా నేను చూస్తూ చూస్తూ ఎలా సాహసించను!

ఆన: తమరలా సెలవీయకండి. భాగ్యభోగ్యాల కేమి? వారికున్నది వారికుంది. మీకున్నది మీకుంది.

డి. త.: పేరొక్కటి లోపం గాని మీరుమాత్రం తక్కువవారా? మీ ఐశ్వర్యం ఏ జమిందారీకి తీసిపోతుంది?

సుబ్బా: తమ రదొకటి పెట్టకండి. మా ఐశ్వర్య మెంత? మే మెంత? ఏదో అన్న వస్త్రాదులకు లోపం లేకుండా గుట్టుగా కాలక్షేపం చేయడంతప్ప నే నంతటి వాణ్ణికాను. అందులో జమిందారీ సంబంధాలకు తూగే తాహత్తు ఎంతటి సంసారికయినా ఉండదు. అందుకనే పెద్దలు ‘సమయో రేవశోభతే’ అన్నారు.

డి. కలె: మీరు సమానులు కారంటే మేమంతా తెలివిమాలిన వాళ్ళమవుతామే కాని ఇతర మేమి లేదు. ఈ వినయసంపద మిమ్మల్ని సమానులనే కాదు, అధికులను చేస్తూ ఉంది. ఆమాటంటే మళ్ళా మీ మొదటి ఆక్షేపణే సిద్ధిస్తుంది కాబోలు! భేరీ జోకొట్టడమే గాని మేము మాకు మాటలు చెప్పలేము. వారు జమిందారులనే సందేహం మీకు సుతరామూ అక్కర లేదు. వారి యోగ్యతా, ప్రజారాధనతత్పరతా మీరైనా ఎఱగంది కాదు. అనవలసి అంటారేకాని, జమిందారు గారు ఏలాగైనా మీవంటి సంపన్న గృహస్థులతో వియ్యమందాలని కుతూహలపడుతున్నారు. మేమంతా అందుకు ప్రేరకులం, అనుమోదకులం. మీరు మా మాట తీసివేయరని ఆశపడివచ్చాం .

అంతలో నా యూరి కరణము వెంకటరాజుగా రందుకొని, ‘సుబ్బారాయుడు బావగారు! మీరు సందేహించకండి. మీ ఉభయులకు సర్వ విధాలా తగిఉంటుంది సంబంధం. బంధుకోటి కందరికీ వాంఛనీయమైనది