పుట:Narayana Rao Novel.djvu/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



౧౩



వేదాంతబోధ

శారదకు గ్రమముగా అత్తవారింటను, మదరాసులో భర్త నెలకొల్పిన కాపుర పుట్టింటిలోను చనువుగా మెలంగుట అలవాటయినది. సూరీడు తన వదిన గారితో బ్రేమ యుట్టిపడునట్లు మాట్లాడును. వదినె గారి నెల్లప్పుడు పలుకరించును, మాట్లాడించును. శారద యొంటిగా గూర్చుండ, నచట నామెకు దోడుగ నుండుటకు బోవును.

శారద యత్తవారింట నున్నప్పు డేరితోడను అంత మాట్లాడునదికాదు. ఒక సూరీడుతోమాత్రము మాట్లాడునది. సూరీడును, శారదయు జెన్నపట్టణములో గలిసియున్నప్పుడు వా రిరువురకు బ్రాణ స్నేహము కలిగినది.

ఇప్పుడు శారద యత్తగారితో మాట్లాడుచున్నది. ఆడుబిడ్డలందరితోడను మాట్లాడును. మామగారు తనకేదైన కావలయునని సూరీడును బిలిచినప్పుడు, శారద తాను వెళ్ళి ‘యేమి కావాలండి’ యని యడుగును. సుబ్బారాయుడు గారు ‘నీకెందుకులే అమ్మా’ అనుటయు, సిగ్గుపడి వెళ్ళి సూరీడు నచటి కంపును.

తనలో ఎందుకీ మార్పుగలిగినదో, అత్తగారితో, ఆడుబిడ్డలతో, మామగారితో తా నీమాత్రమైన నేల మాట్లాడుట మొదలు పెట్టెనో యామెకు దెలియదు. రెండు మూడుసారు లామె ఆలోచించుకొని మాట్లాడక యుండ వలయునని యనుకొన్నది. కాని యంతకు రెట్టింపుసారులు అప్రయత్నముగ వారితో మాట్లాడినది. ఆమె హృదయము ప్రేమమయము. తండ్రిపోలిక. అత్తవారియింట చనువేర్పడగనే యా మహాప్రవాహములో బడిపోయినది.

సూరీడుకు తలదువ్వుట నేర్చుకొన్నది. పిల్లల జనవుగా నాడించుట మొదలిడినది.

ఇంతలో శకుంతల, చెల్లెలు తన మరిది గారి యింటికి వచ్చినదనియు మరిది గారి తండ్రికి వైద్యము చేయించుటకు జెన్నపట్టణము తీసికొనివచ్చినా రనియు దెలిసి, యనంతపురమునుండి, చెన్నపట్టణము తన మేనత్త కుమారుని యింటి కిరువురు బిడ్డలతోడను వచ్చినది.

నారాయణరావునందు గౌరవము కుదిరినప్పటినుండియు శకుంతలకు తన భర్తయెడ దొంటి వైఖరి మారిపోయినది.

జగన్మోహనుని వివాహానంతరము తిరిగి భర్తకడకు వెళ్ళినప్పుడు, భర్త తనపై కేకలువేసినప్పుడు మరల జవాబు చెప్పెడిదికాదు. ఆరోజునుండి భర్తకు వలయు దుస్తులందించుట, స్నానమునకు నీరు తోడించుట మొదలగు పరిచర్య