పుట:Narayana Rao Novel.djvu/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

342

నారాయణరావు

పర్చాను. ఇంతే. ఏ వనితామణినీ నేను హీనముగా గాని, హేళనగా గాని చూడలేదు. భగవంతుడనేవాడు ఉంటే ఆడవాళ్ళే ఆయన అవతారాలని, సైతాను అనే దెయ్యం ఉంటే మగవాళ్లే ఆతని అవతారాలని నా ఉద్దేశం.

‘నేను ఆరోజున అన్న ముక్కలకు నాపైని చాలా తప్పు అభిప్రాయం పడ్డారని నాకు మన స్నేహితుడు చెప్పాడు. అప్పుడే మీకు ఉత్తరం వ్రాయాలని అనుకున్నాను, తల్లీ! నా ఉద్దేశం, నా అభిప్రాయాలలో సత్యమున్నదని. నేను తుచ్ఛుడనే. మీరు పరపురుషుల్ని చేరేటటువంటి మనుష్యులని ఉద్దేశింపబడి అన్నది కాదు. నేను మనసులో ఒక ఉద్దేశం, పైకి ఒక ఉద్దేశం ఉంచుకునే వాణ్ణిగాను. కాబట్టి అప్పుడు నాకు ప్రేమ కలిగినప్పుడు (వాంఛ అనండి) ఆ సంగతి దాచుకోకుండా మీతో అన్నాను. అంతే. మిమ్ము అప్పటినుంచి క్షమాపణ కోరవలెనని అనుకొన్నాను. కాని వీలులేకపోయింది. నేడు నా ఉద్దేశాలు మారాయో లేదో చెప్పలేని విషమసంధిలోకి వచ్చి నారాయణుని ఉత్తరంలో రాసిన కారణాలవల్ల ఈ ప్రపంచం వదలివేస్తున్నాను. మీరు క్షమిస్తే, నాకు ఆత్మ అనేది ఉంటే అది సంతోషిస్తుంది. తల్లీ, నమస్కారాలు.

–రాజేశ్వరుడు’

అందరూ స్తంభించిపోయినారు. నారాయణరావు శ్యామసుందరి వైపు తిరిగి ‘అమ్మా! అతని ఆత్మతరఫున క్షమించమని నిన్ను కోరుతున్నాను’ అని అడిగినాడు. శ్యామసుందరి కన్నుల నీరు తిరుగ ‘అన్నా! అతన్ని గురించి నేను తప్పు అభిప్రాయము పడినందుకు ఆతని ఆత్మను క్షమాపణ అడుగవలసి ఉన్నది. భగవంతుడు ఆతని ఆత్మకు శాంతినిచ్చు గాక’ అని అన్నది.

మాటలాడక స్నేహితులందరూ ఈవలకు వచ్చి నారు. రోహిణీ దేవి వారికడకు వచ్చి ‘నారాయణరావు అన్నా! రాజేశ్వరుడు విషం పుచ్చుకొని చనిపోయినాడా?’ అని అడిగింది.

‘అవునమ్మా.’

‘ఏమిటీ కారణం?’

‘ఈ ఉత్తరం చదువుకో. తర్వాత నేను చెప్తాను.’

రోహిణి ఆ యుత్తరము దీసికొని చదివికొన నారంభించినది.

‘నా ప్రియసోదరుడగు నారాయణా! నీ చేయి యేది? నేను సెలవుతీసు కుంటున్నారా! నాకు చాలా పెద్ద ప్రయాణం ఉందో, లేదో, ఇంతటితో ఆఖరో తెలియదు. కొని యింతవరకు దివ్యంగా బ్రతికాను. యుద్ధంలో అభిమన్య కుమారుడిలా ఆయుధంతో జన్మ విసర్జిస్తున్నాను. జన్మ విసర్జించటం కాదు ఆఖరు చేయటం! ఏమోరా, ఏదయినా యిబ్బంది లేదు.

‘పుష్పశీల ప్రతి మధుపానికి తన మధువును ఇస్తోంది? మంచి పేరుపెట్టాడు. కాని ఆమె ఏమిచేస్తుంది? పాపం నేనే ఆవిడ బ్రతుకు ఒక లంగరుకు కట్టిఉంటే, లంగరుత్రాడు కోసేశాను,