పుట:Narayana Rao Novel.djvu/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహధర్మము

329

తన హృదయము దహించుచున్నది. తాను క్రొత్తగా స్వతంత్ర ప్రేమ సంఘములో జేరినప్పుడు, కొందరు కొందరు యువతులతో దాను వినోదించినప్పడు, వారు తన్ను వదలి యితరులతో జరించునప్పుడు తా నెట్టి యీర్ష్యయు నందలేదే! అట్టి తనకు నే డీ యీర్ష్య యెక్కడ నుండి జనించినది?

రాజేశ్వరుడు పుష్పశీలకడ కొకదినమున బోయినాడు.

‘పుష్పం! నాపై ప్రేమ అంతా మారిపోయిందా?’

‘ఛా! ఛా! అదేమిటి రాజా! అల్లా అంటావు? నీవు నా ఆత్మనాథుడవు. నిన్ను తప్ప నేను ఇంకో పురుషుణ్ణి తలంపలేను. నేను నీ దానను.’

‘నువ్వు మాట్లాడేది నాలిక చివరినుంచా, హృదయములోనుంచా? పుష్పశీలా! నీకు ప్రేమమారితే మారి ఉండవచ్చు. అది తప్పు అనే ఉద్దేశముతో నిన్నీ ప్రశ్నలు అడుగుట లేదు. నిజము చెప్పవలసింది అని. ఎందుకీ గ్రుద్దులాట? మన యిద్దరిస్థితి యేదో ఒక నిశ్చయానికి, ఒక మార్గానికి వస్తుందని, అంతే. నీపై నా ప్రేమమాత్రము ఇసుమంతైనా తరగలేదు, అదేమి చిత్రమో!’

‘ఇదివరకు మీ ప్రేమకూడ అస్తమానము మారుతూ ఉండేదిగా?’

‘అప్పటికి నా ప్రేమకు తగిన స్త్రీమూర్తి కనబడ లేదు కాబట్టి.’

‘అల్లాగే నాకు ఇప్పటికి నా ప్రేమకు తగిన పురుషమూర్తి కనబడలేదేమో అనుకోరాదా?’

‘అవును. అందుకనే నేను నిన్ను అడిగేది ఏమిటంటే, నీ హృదయము ప్రస్తుతము మారిందా? అని.’

‘అది నేను ఎలా చెప్పగలనండీ!’

‘అదేమిటి పుష్పం! నువ్వు చెప్పలేవా! ఇదివరకు లేనిది నన్ను కొత్తగా అండీ అని అంటున్నావు. నీ హృదయం మారినటులే తోస్తూంది.’

‘అండీ అనకూడదా! మీరు నాకు భర్తవంటివారు గనుక అన్నాను.’

‘అబ్బా! నన్ను నీ భర్తవంటి వాణ్ణి అన్నావు, సరే, నేనున్నూ మిమ్ము గౌరవంచేసి మాట్లాడనా?’

‘అదేమిటి నామీద ప్రేమ తప్పిందా?’

పుష్పశీల సుడిగాలి వేగమున వచ్చి రాజేశ్వరుని కౌగిలించుకొన్నది. అతని నదిమిపట్టి పెనవేసికొనిపోయినది. ‘నీకు వట్టి అనుమానం నాథా! లేని పోనివి పెట్టుకోకు’ అని యామె యాతని చెవిలో సన్నని యెలుగున పలికినది. అతడును, ఆమెయు మోహావేశమున మైమరచినారు.

నాలుగురోజులైన వెనుక రాజేశ్వరుడు తోటలో చెట్లకు మళ్ళు త్రవ్వుచుండెను. ఆ రోజు శుక్ర వారము. నెలవు చీకట్లుపడినవి. అంతయు