పుట:Narayana Rao Novel.djvu/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

నా రా య ణ రా వు

శిఖర పద్మశిల యా దిబ్బమూపుపైననే యుండునట్లు చూచుకొనుచుండెను. మూడుదినములలో బర్వతమువలె నాయిసుక దిబ్బ శిఖరముకన్న నెత్తుగ నూట యిరువది నాలుగడుగులు సువ్వునలేచినది. విమానశిఖరశిలయు నాదిబ్బమూపుననే యున్నది. అప్పుడా విమానశిల కడుగున నుండి విమానశిఖరమునకు గట్టి దూలపు కమ్మిలు చేర్పించినా డా బాలశిల్పి. రాతికి ఇటు నటు తాళ్ళుకట్టి కమ్మిలపై జరిపించి శిఖరముపై నాశిఖరశిల నమర్చి కమ్మీలు లాగించివేసినాడు.

రాజు ఈ మహాకార్యకౌశలము దినదినము వచ్చి చూచుచు, కార్య సాఫల్యమునకు సంతోషించుచుండెను. విమానశిఖరశిల నమర్చురోజున దేశ దేశముల నుండి జనమువచ్చి ఆ చిత్రము చూచి ఆనందించిరి. ఆ వచ్చిన వారిలో నాస్థానశిల్పియు నున్నాడు. అతడు వచ్చిన వార్త నేరు నెరుగకుండ నాశిల్పి విన్నబోయిన మోముతో ఆ జనమహాసముద్రమున జేరి విచిత్రమును జూచు చుండెను.

శిఖరశిల నమర్చుటయు మహారాజు మెడలో హారమువేయు ఆ బాలశిల్పి వంగి నమస్కరించి మరునాడు శుభముహూర్తమునకు సర్వము దేవాలయమున సిద్ధముజేయ నాత డా గుడిలోనే పండుకొన్నాడు.

కుమారుని గుర్తించలే దా తండ్రి. చిన్న నా డిల్లువదలిపోయిన ఆ బాలున కిప్పుడు మీసములు పెరిగినవి. పురుషుడైనాడు. దేహమంతయు గట్టిబారినది. అట్టి కుమారుని గుర్తించక తన్నిట్లవమాన బరచిన యా ద్రోహిని హత్య నొనరింపవలయునని దుర్బుద్ధిజనించి, యారాత్రి గుడిలో నొంటిమై నిద్రించు దన కుమారుని బాకుతో పొడిచినాడు. బాలకుడు హృదయమునుండి రక్తము స్రవింప హాయని నిదురలేచి యా దీపపు వెలుతురున దండ్రిని గుర్తించి ‘తండ్రీ నన్నేల బొడిచినావు? నన్నానవాలుపట్టలేదా! అయ్యో! ప్రాణములు పోవుచున్నవి. స్వామికార్యమునకై యా శిఖరము నేనెక్కించవలసివచ్చినది. జనకా! రేపటిదినము సర్వోచ్ఛమగు ముహూర్తమట. అబ్బా బాధ! ఈ బాకు పీకివేయుము. నా తండ్రీ! గురుదేవా! నీ చేతిలోనే మరణించినందులకు సంతసమే. నీకివే నాచరమప్రణామము’ లనుచు ప్రాణములు విడచినాడట.

తండ్రి కుమారు నానవాలుపట్టి గుండె తరుగుకొనిపోవ, తాను చేసిన మహానేరమును, కుమారుని చంపుకొన్న క్రూరకర్మమును నిందించుకొనుచు తన ఘోరకృత్యమునకు గుండెపగిలి యచ్చటనే చనిపోయెను.

మరునాడు శుభముహూర్తమున ప్రతిష్ట జరగలేదు. మరి యెప్పుడును జరగలేదు.

ఆకథ విని పరమేశ్వరునకు గన్నుల నీరుతిరిగినది. నారాయణరా వట్లనాయని నిట్టూర్పునించినాడు. కోణార్కలో, జగన్నాథములో, భువనేశ్వరములో దేవాలయములకు శ్రీవిమానము లెత్తైయుండును. అంతకన్న మధ్యమండపము, అద్దానికన్న ముఖమండపము చిన్నవి. గోపురములు చిన్నవి. గుడియంతయు