పుట:Narayana Rao Novel.djvu/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

నా రా య ణ రా వు

అన్నట్లు తెలియజేస్తూ, హరిశ్చంద్రుడు ఇట్లనవచ్చును, అని వ్యక్తీకరిస్తాడు. తర్వాత తానే హరిశ్చంద్రుడవుతాడు. అంటే తన ఆశయంలో హరిశ్చంద్రు డిట్టివాడు, ఆ హరిశ్చంద్రుడే నేను అన్నట్లు అభినయం చెయ్యాలి.

లక్ష్మీ: మీరిద్దరూ ఒకేరకంగా చెప్పారు. ఇంకా విపులం చెయ్యాలి.


శో భ న మం ది ర ము

ఎప్పటికిని సాయంకాలము కాదు. పేక ఆడినాడు నారాయణరావు; బ్రిడ్జి, బేస్తు, లిటరేచరు ఎన్ని ఆడినా తోచినదికాదు. హిందూదేశం అంతట, క్లబ్బులలో, గ్రంథాలయములలో, ఇండ్లదగ్గర పాశ్చాత్యదేశమునుండి పందొమ్మిదవ శతాబ్దిలో దిగిన దీ పేకాట. బ్రిడ్జి, ఆ ఆటలలో మహారాజు వంటిది. ఆ యాటలో మన ఆంధ్రులు శక్తి సామర్థ్యములు సముపార్జించుకొన్నారు. నెమ్మదిగా ననేక భేదములతో బ్రిడ్జి యాట దేశమంతటను పల్లెటూళ్ళకును గూడ బ్రాకినది.

‘బేస్తాట’ ప్రత్యేక మాంధ్రుల సొత్తు. కాని డబ్బు మేజుపెట్టి యాడినచో నంత నష్టముండదు. అర్థణా, అణా, బేడ మేజుపెట్టి సంసారములు ధ్వంసము చేసికొనువారు కొందరు, కొంద రదేవృత్తిగా ధనము సంపాదించుకొనువారు. జూదమే అని చెప్పదగిన ‘రన్‌మోరు’ అను నాట కొందరు రహస్యముగా నాడుచుందురు.

ఈ ఆలోచనలతో నారాయణరావు బేస్తాటలో రెండురూప్యము లోడు వడి, ఎపుడు ప్రొద్దుకుంకునాయని ఎదురుచూచుచు, హృదయములోని భావములు పరమేశ్వరునికి దక్క నేరికిని తెలియనీయక గడియ లెట్టెట్లో వెడలబుచ్చెను.

రాత్రి శుభముహూర్తము సమీపించినది. నారాయణరావు వంగపండు చాయ పట్టుతాపితాలతో వచ్చి పీఠముచెంత నిలిచినాడు. శారద వెలవెలబోవు మోముతో వెండిపళ్ళెరాన గుమ్మడిపండు, నారికేళబొండము, అరటిపళ్ళు, ఖర్జూరఫలములు, పసుపుకుంకుమ, మంత్రాక్షతలు మొదలగు వస్తువులతో బ్రక్కనే నిలిచియుండ, భూదేవత ననుజ్ఞ నొసంగ మంగళపీఠములపై కూర్చుండ నియమించిరి. శ్రీ గణేశ్వరుని దంపతు లర్చించిరి.

కర్మణః పుణ్యాహవాచనము పురోహితులు జరిపించిరి. భార్యాభర్తలకు జమీందారుదంపతులు కట్నాల నొసంగిరి. దంపతులకు బ్రహ్మముడిని రచించినారు వసిష్ఠులు. దేవరులు ప్రత్యక్షమై దివ్యమంత్రములు పఠించినట్లయినది. మంత్రములు మిన్నుముట్టి దిక్కుల గలసిపోయినవి. శుభముహూర్త మరుగుదేర మంగళ వాద్యములు మ్రోగించినారు.