పుట:Narayana Rao Novel.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

నా రా య ణ రా వు


నేడు వీరభద్రరావుకు దన నైచ్యమంతయు గనులకట్టినది. సత్యవతి తనకు చేసినసేవ, యామె ప్రేమ, యామె మెత్తని హృదయము జ్ఞప్తికి వచ్చినది. మరల ననుమానపు బిశాచము పీడించినది. భార్య యెవరో యొకనిని ప్రేమించుచున్నదని కాదు, తన్ను మాత్రము ప్రేమించుటలేదని యాతని భావము.

నారాయణరావు రెండురోజులక్కడ నుండి వీరభద్రరావుకు వేదాంతము బోధించినాడు. ఇతర దేశములలో, స్త్రీలను జూచు విధ ముగ్గడించినాడు. స్త్రీలను పూర్వమునుండియు భారతీయులు గౌరవించుచుండి రన్నాడు.

‘బావా! మనకు స్త్రీ లెంత గౌరవనీయులోయి! మన నాగరికతను, మన గౌరవాన్ని, మన నీతిని, మన జాతిని కాపాడుచున్నది ఆడవాళ్ళోయి బావా. ఖడ్గతిక్కనను జ్ఞప్తికి తెచ్చుకో. రుద్రమదేవిని, తరిగొండ వెంకమాంబను, మొల్ల మొదలగువీరవనితలను స్మరించుకో! మాంచాల భర్తకొరకై తపస్సు చేసి, భర్త బోగందాని వలలో బడితే, భర్తను కాపాడుమని దైవమును ధ్యానించి, భర్తపాదాలు స్మరించి స్మరించి ఉంటూ ఉన్నప్పుడు, బాలచంద్రుడు యుద్ధానికి అనుజ్ఞ అడగడానికి మాంచాలదగ్గరకు వస్తే, మాంచాల కత్తినిచ్చి యుద్ధానికి పంపి, భర్త వీరమరణం పొందితే తాను సహగమనం చేసింది. మల్లమ్మదేవి చరిత్ర తెలియదు బావా నీకు?’

కొన్నిగంట లాతని బొగడినాడు. ‘నీ హృదయం చాలా మంచిది బావా! నువ్వెందరకు ఉపకారం చెయ్యడం నే నెరగను! నీబోటి మనిషి మా సహాయ నిరాకరణంలో జేరితే గొప్ప నాయకుడవు అవుదువు. నీ హృదయము ఈ ఉద్యోగంలో చేరడంవల్ల యిల్లా పాడయింది. కాని యిలాంటి ఉద్యోగాలలో ఉండి తమ జీవితాలను న్యాయమార్గాన్ని నడిపే మహానుభావులున్ను ఉన్నారని యిప్పటివరకు ప్రజలు చెప్పుకోవటం లేదటోయి?’

మరునాడు నారాయణరావు బావమరదికడ సెలవు పుచ్చుకుని, అక్కగారికి దండ్రియిచ్చిన ఇరువది రూపాయలు సేత బెట్టి కొత్తపేట వెడలి పోయినాడు.

తల్లితో సంగతులన్నియు జెప్పి తాను తన బావమరది మనస్సును కొద్ది నెలలలో మార్చగలనని ధైర్యము చెప్పెను.

‘నాయనా, నువ్వలా అంటావు. ఎవరు మార్చగలరురా ఆ కర్కోటకుడి మనస్సు! అల్లాగే కుళ్ళి కుళ్ళి కృశించి, సత్యం ఏ నుయ్యో గొయ్యో చూచు కొంటుందిరా నాయనా!’

‘అదికాదు అమ్మా! నువ్వలా కుంగిపోతా వెందుకే? దాని బాధ తప్పించడం నాది భారం. అతను ఈ పట్టు నా చిన్నక్కయ్యను కష్టపెట్టాడా, నేను వెళ్ళి అతని యింటిదగ్గిర నిరశనవ్రతం చేస్తాను. దానివల్ల ఆతని మనసు పూర్తిగా కరుగుతుంది.