పుట:Narayana Rao Novel.djvu/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా స న స భ

153

సభికులందరు రెండుభాగములుగా కూర్చుందురు. ప్రభుత్వపక్షమువా రధ్యక్షుని కుడిచేతివైపునను, ఎదిరిపక్షమువా రెడమభాగమునను పీఠములపై నధివసించెదరు. ప్రభుత్వపక్షమున మంత్రులు, గవర్నరు, కార్యనిర్వాహక సభాసభ్యులు, మంత్రులపక్షము వారు శాసనసభకు ప్రభుత్వముచే నియమితులైన సభ్యులు నుందురు. ప్రభుత్వవిధానములో జరిగిన పొరపాట్లు, తప్పులు, మాయలు ప్రపంచమున కెరిగించుటకు, ప్రభుత్వము వారి బడాయిని పటాపంచలు చేయుటకు, కష్టనిష్ఠురములు చెప్పుకొనుటకు, ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గము వారిని మంత్రులను ఎదిరిపక్షము వారు ప్రశ్నలడిగెదరు.

ఆయా ప్రశ్నల నడిగెదమని సభ్యులు ముందుగానే తెలియజేయవలను. ప్రశ్నకాలము వచ్చినప్పుడా ప్రశ్నకు సంబంధించు నితర ప్రశ్నలనుగూడ నడుగవచ్చును. ఇట్టి ప్రశ్న వేయుచున్నానని సభ్యుడు తెలియజేయుటతోడనే యాజిల్లాలో నా శాఖముఖ్యోద్యోగికి ఆ విషయమును గూర్చి వివరములకొరకు వ్రాసెదరు. వా రేజవాబిచ్చెదరో యాజవాబే శాసనసభలో ప్రభుత్వసభ్యుడు వినిపించును. ఒక్కొక్క ముఖ్యవిషయము వచ్చునప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పక్ష సభ్యులు ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గసభ్యులను ప్రశ్నలచే గజిబిజి చేయుదురు. ప్రభుత్వ సభ్యులుమాత్ర మీ తాటియాకు జప్పుళ్లకు వెఱవరు.

చెన్న రాజధానిలో బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్య తీవ్రముగా నున్నది. చెన్నరాజధానికన్న కొంచెము తక్కువగా బొంబాయి రాజధానిలో నున్నది. చెన్నరాజధానిలో బ్రిటిషు ప్రభుత్వము వచ్చినప్పటి నుండియు బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములు సముపార్జించియుండిరి. అందు అరవ దేశపు టయ్యర్లు, నయ్యంగార్లు నుత్తమోద్యోగము లన్నియు తమ కాణాచిగా జేసికొనిరి. మరియు దక్షిణాపథమున బ్రాహ్మణేతరులను బ్రాహ్మణులతి నీచముగ జూచుచుండిరి. బ్రాహ్మణాగ్రహారవీథుల బ్రాహ్మణేతరులు వెళ్లుట యెంతయో కష్టతమమై యుండునది. బ్రాహ్మణునకు బ్రాహ్మణేతరునకు నెంతస్నేహమున్న నా బ్రాహ్మణేతరుడు బ్రాహ్మణుని యింటికి భోజనమునకు వచ్చినప్పు డింటిలో నందరు భోజనము చేసినవెనుక, వీథిసావడిలో భోజనము వడ్డించెదరు. కాఫీ దుకాణములలో బ్రాహ్మణులకు వేఱు, బ్రాహ్మణేతరులకు వేఱు.

రాను రాను బ్రాహ్మణేతరులకు బ్రాహ్మణులన్న కోపము, ఉడుకు బోతుతనము, తమస్థితి వృద్ధిచేసికొనవలెనన్న యిచ్ఛయు జనించినవి. వైద్యశిఖామణి యగు డాక్టరు నాయరు యాజమాన్యమున బ్రాహ్మణేతర సమావేశములు జరిగినవి. ఉపన్యాసములు, వ్యాసములు, కొరడా చురుకువలె కత్తిపోటుల వలె తీవ్రముగ ప్రబలినవి. బ్రాహ్మణేతర సమస్య యాంధ్రదేశమున కెగబాకినది. త్యాగరాజశెట్టి, కూర్మా వెంకటరెడ్డినాయుడు, రాజా పానగల్లు, రామస్వామి మొదలియారు మొదలగువారు నాయకులై విజృంభించినారు. ఉద్యమ స్థాపకుడగు డాక్టరు నాయరు చనిపోయినారు. ఇంతలో మహాత్మాగాంధి గారు