పుట:Narayana Rao Novel.djvu/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
134
నా రా య ణ రావు


రొజా: ఆ చిక్కు రాకుండగ తప్పకొనుమార్గమే నేను చెప్పునది.

డయానాకు వీరి సంభాషణచే విసుగు జనించి తాను సీతాకోకచిలుక నాట్యమాడెదనని తెలిపి ఫిడేలువాద్యము వాయించగల తన యన్నగారిని ఫిడేలును, తన తల్లిని పియానోను వాయింప నియమించి, గెరార్డుబ్లాండెల్లో రచించిన ‘సీతాకోకచిలుక’ గీతముయొక్క స్వర ప్రస్తారము గుర్తుగల కాగితములు తెచ్చియిచ్చెను.

వారిరువురు వాయించుచుండ డయానా సీతాకోక చిలుక రంగుగల సన్న శాలువ రెక్కలుగబట్టి విచిత్రనాట్య మొనరించినది. ఆ నృత్యమున వారందరు తన్మయులై యుండ టింగ్ మని యొంటిగంట కొట్టినది. నాట్య మాగినది.

జగన్మోహనుని మోటారుశకటముపై రొజారియో దంపతులు, ఫ్రాన్సిస్ కన్య వెడలిపోయిరి.

జగన్మోహనుడు డయానాకన్యతో మేడమీద గదులలోనికి బోయినాడు.

జేమ్సు ఆ చీకటిలో సోఫాపైన కూర్చుండి స్పెన్సరుచుట్ట కాల్చుచు నేదో యాలోచనలో మునిగిపోయినాడు.


౯(9)

పొలం

సత్తెయ్యకు భార్య కొత్తగా గాపురమునకు వచ్చినది. పదునేడేండ్ల వయసుకత్తె. చామనచాయ. బిగువయిన యవయవములు, సోగచూపులు, స్ఫుట రేఖలుగల మోము, నవనవలాడు నూత్నయౌవనములోనున్న యామె పంట లక్ష్మివలె నవతరించినది. సోమయ్య ఇల్లు పావనమైనది. ఆతడా పేదయింటి పడుచు రూపు రేఖలకు వలచి కోడలుగా వరించి తెచ్చుకొనెను.

‘ఒక నూరురూపాయలు కట్నం తేస్తే నిండిపోతాదా? మన అదురుట్టం బాగుండాలి గాని, అదురుట్టం లేకపోతే కోడలు యెయ్యిరూపాయలు కట్నం తెచ్చినా అత్తింటిలో అడుగెట్టిందా అన్నీ భగ్గున మండిపోవడమే. మాకోడలు మాలచ్చే; చూస్తుండండి. మావోడి జల్మ పావనం అయిపోతాది!’ అని సోమయ్య తన చుట్టాలతో జెప్పికొన్నాడు. వెండివడ్డాణం, దండకడియాలు, పిల్లకాసులపేరు పెట్టుకొని చిరునవ్వు నవ్వుచు ‘పల్లెటూరి కాపుబాలయైనదా లక్ష్మి' యని అనిపించునట్లు సూరమ్మ సుబ్బారాయుడిగారి దొడ్డిలో బ్రత్యక్షమైంది.

జానకమ్మగారికి, సుబ్బారాయుడుగారికి నూత్నవధూవరులచే నమస్కారములు చేయించుటకు దీసికొనివచ్చినప్పుడు, సుబ్బారాయుడుగారు నూరురూపాయలు వారికిచ్చి, సంసారమునందలి కష్టసుఖములు వారికిబోధించి, భార్య