పుట:Narayana Rao Novel.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

నారాయణరావు

దెరలకు గొన్ని లక్షల డాలర్లు రౌనాల్డుసన్ వెచ్చబెట్టియుండును. తన తండ్రియు, నారాయణరావు ప్రోత్సాహముచే తన మామగారును బంపిన పదివేల రూప్యములకు సరియగు డాలర్లను రౌనాల్డుసన్ రామచంద్రుని పేర మంచి బ్యాంకిలో వేయించెను.

రామచంద్రరావు బి. ఎస్‌సి. తరగతిలో చేరుటకు వలయు సౌకర్యముల నన్నియు జూచుకొని హార్వర్డు విశ్వవిద్యాలయమునకు లియొనారా కన్యతో రౌనాల్డుసన్ సతీమణితో గలసివెళ్ళి విశ్వవిద్యాలయములో చేరినాడు.

విద్యార్థులనేకులు త్రోవబత్తెముమాత్ర మెట్లో సముపార్జించుకొని, అమెరికాకుబోయి విద్యాలయములలో ప్రవేశించెదరట. అమెరికా ధనవంతుల కాటపట్టగుటచే, ఇంగ్లండు దేశమునకన్న నక్కడ నన్నివస్తువులును మిగుల గిరాకిగా నుండును. తక్కిన యూరపియను రాజ్యములకన్న ఇంగ్లండులో వస్తువుల విలువ ఎక్కువ. భారతదేశమునకన్న యూరపియను దేశములలో వెల అధికము. కావున అచటికేగిన విద్యార్థులు హోటళ్లలో వడ్డించియో, సినిమాలలో బ్రేక్షకులకు దారిచూపియో, ఇంచుకించుక సంపాదించుకొందురు. కొందరు సెలవులకు పల్లెటూళ్లకు బోయి, యచట రైతులకడ గూలిపనిచేసి ధనము సేకరించెదరట. బీదవిద్యార్థు లిట్లెన్నియో యగచాట్లుబడి చదువు కొందురు. కొందరు బాలురకు శ్రీరామతీర్థ వివేకానందులేర్పరచిన యుచిత వేతనములు దొరుకునట. అమెరికాలోని భారతీయులను అమెరికనులు చాల గౌరవము చేయుచుందురు. భారతీయులు అమెరికా ప్రజలగుటకు మాత్రము అమెరికను లొప్పరు. తమతో వర్తకము జేయుటకు, తమదేశపు విచిత్రములు జూచుటకు వేదాంతములగూర్చి ఉపన్యసించుటకు, తమ విద్యాలయములలో జదువుకొనుటకు భారతీయులు విచ్చేయుట అమెరికనుల కెంతయు నిష్టము.

అమెరికాదేశమునకు బోయిన యాంధ్రులసంఖ్య చాల స్వల్పము, వంగల శివరాముగారు పి.హెచ్.డి. రాజ్యతంత్రజ్ఞానమునందు పట్టమునంది, భరతదేశమున, కలకత్తా విశ్వవిద్యాలయములో, నటుతర్వాత లక్నో విశ్వవిద్యాలయములో పండితులుగాజేరి ప్రఖ్యాతిబడసియున్నారు. బాపినీడుగారు ఎమ్.ఏ. వ్యవసాయశాస్త్రమున పట్టమునంది, భారతదేశమునందు వ్యవసాయమున నూతనమార్గముల నెలకొల్ప దీక్షతో నున్నారు.

ఎలాప్రగడ సుబ్బారావుగారిని రామచంద్రరావుగారు హార్వర్డు లోనే సందర్శించినారు. చెన్నపట్టణములో నాయన వైద్యవిద్యలో ఎల్.ఎమ్.ఎస్. పట్టమునంది, హార్వర్డు విశ్వవిద్యాలయములో ఉన్నత వైద్యవిద్య బడయుటకు సంకల్పించి, యా విద్యాకృషిలో దన్మయులై, యుత్తమ పరీక్షలలో గృతార్థులై, వైద్యవిద్యలో సత్యనూత్రార్జన తపస్సులో లీనమైపోయినారు. ఆయన విద్యయే యాయనకు భార్యయట, తల్లియట, బిడ్డలట. మరల భారతదేశమున కెప్పుడు రాగలడో? తన గురువు గారితో