పుట:Narasabhupaleeyamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కావ్యాలంకారసంగ్రహము


లాలకయంగవల్లిఁ బులకాంకురము ల్ననలొత్త నే మనం
జాలక యూరకుండె ననిశంబు [1]వినమ్రముఖాంబుజాత యై.

148

భావసంధి —

మ.

హరి కానంగ శరాళి యై యరికవేలాభీలదివ్యాశుగో
త్కర మై శౌరికిఁ బాటలాబ్జకలికాదామంబు లై వైరికి
న్నిరతాగ్నిప్రభ లై వెలుంగునరకానీకాధికోల్లాసభా
సురసత్యారమణీకటాక్షములు ప్రోచున్ శ్రీనృసింహాధిపున్.

149

భావశబలత —

మ.

చెలు లేమందురొ భావవీథి నకటా శ్రీనారసింహేంద్రుకౌఁ
గిలి నా కెన్నఁడు గల్గునో నృపతితోఁ గ్రీడింపఁగాఁ బోవుచం
చలపుంజిత్తము నేమి సేయుదు గురు న్సద్భక్తిఁ బ్రార్థింతునో
యల ప్రాణేశ్వరుఁ జూడ కున్నఁ బరితాపాటోపము ల్మానునే.

150

నవరససంకరము —

మ.

జయలక్ష్మీరత మై ప్రతాపయుత మై శత్రుచ్ఛిదాధుర్య మై
ప్రయతార్తావన మై కపీంద్రగతి యై రక్త్రార్ద్ర మై నిర్ఘనో
దయవిద్యున్నిభ మై సకంప మయి వందారుస్పృహాశూన్య మై
నయ మొప్ప న్నరసింహుఖడ్గ మమరు న్నానారసప్రక్రియన్.

151

రసాధిదేవతలు —

సీ.

హరికి శృంగారలీలాధిపత్య మొనర్చు, గణనాథు హాస్యసంగతునిఁ జేయు
నలికలోచనునిపై నధికరౌద్రము నిల్పు, శక్రుపై వీరరసంబు నెఱపు
యమునిపై[2]ని దయామయత్వంబు ఘటియించు, జగతి మహాకాలు సభయుఁజేయు
శర్వరీంద్రుని జుగుప్సారసాన్వితుఁ జేయు, శతధృతి నద్భుతాన్వితు నొనర్చు


తే.

శాంతి బ్రహ్మంబు జేర్చు నిచ్చలు నృసింహు, భువనభరణంబు నరవిఘ్ననివహహరణ
మీశతయు భోగము ననేకనృపతిహృతియు, ననియు యశమును మతియు బోధాతిశయము.

152


సీ.

మరకతానీకదంభమున శృంగారంబు, హాస్యంబు ముక్తాఫలౌఘరుచులఁ
గరుణ[3]విద్రుమవర్ణగౌరవచ్ఛలమున, రౌద్రంబు కురువిందరత్నకలన

  1. త్రపావృత యైనకైవడిన్
  2. శోకమ
  3. విద్రుమంబు