Jump to content

పుట:Narasabhupaleeyamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

ల్పూని హరింపఁ దద్గళితభూరిసమున్నతఖడ్గము ల్పర
స్థానము చేసిన ట్లమరు సారెకు వారికి నూర్థ్వయాత్రకున్.”

⁠

అద్భుతకల్పన

⁠

బలధూతధూళిచేఁ బందిళ్లు సమకట్టి, యహితరక్తము కలయంపి చల్లి
వనయశోరుచివితాననితానములు గట్టి, వివిధవాద్యధ్వను ల్వెలయఁ జేసి
విమతాస్థిపటలచూర్ణముల ముగ్గులు పెట్టి, ద్విజపరంపరలకు విం దొనర్చి
దళితారికుంభిముక్తాఫలంబులనేస, చల్లి ప్రతాపాగ్ని సాక్షి గాఁగ

⁠


తే⁠

మెఱయు నేరాజు విజయలక్ష్మీవివాహ, విదితసన్నాహుఁడై యతఁ డదురుగుండె
పిఱికికండయు లేనిగభీరఘోర, రణజయోత్సాహి పాసెను రామవిభుఁడు.”

⁠


“చ.⁠

చకచకమించు సింగనృపచంద్రునిశాక తకృపాణవల్లిలోఁ
బ్రకటవిరోధియూధరథభద్రగజాశ్వవరూథినీకదం
బకములు గాన వచ్చు సులభప్రతిబింబితమూర్తులై మహా
జికలితసాధ్వసోదయముచే నసిగర్భముఁ జొచ్చెనో యనన్."

⁠

నిరుపమానశ్లేష

"సీ.⁠

ఖరదూషణాఖర్వగర్వనిర్వాపణం, బాజి నెవ్వానిసాయకనికాయ
మధికతారావరాహంకారవారణో, ద్వేల మెవ్వనియశోవిమలశోభ
వివిధారికామినీవిఘటసాటోప మే, యవనీశురోషారుణాక్షిరేఖ
పౌలస్త్యనిరసనప్రౌఢిమాఢౌకితం, బేరాజు చారిత్రచారుభూతి

⁠


తే.⁠

యతఁడు కలియుగనవ్యరామావతార, చారుతాసార్థనామప్రదానుఁ డగుచు
వెలయు బ్రహ్మాండపేటికావితతకీర్తి, ధనుఁడు శ్రీరంగవిభురామధరణిధవుఁడు."

⁠

అనన్యసాధ్యమగు శైలి

"సీ.⁠

వనజారి కళలచేఁ దనివి నొందించిన, నిల ఖేచరుఁడు ప్రాణ మిత్తు ననిన
ననదంబు తనదుజీవన మెల్ల నొసఁగిన, నెమ్మేను శిబి కోసికొమ్మటన్న
నీగిగి మ్రానేసొమ్ము లిచ్చినసురమణి, మి న్నంది తెలఁపులో మెలఁగు చున్నఁ
జేరి పాదము బలి శిరసావహించినఁ, బాధోధి దా నెంత భంగపడిన

⁠


తే.⁠

వారి నెవ్వారిగా దని వసుధ నౌర, నిక్కముగఁ గీర్తకామిని నీకుఁ దక్కె
నీదువైదగ్ధ్యగుణము వర్ణింపఁదరమె, నరనుతాటోప తొరగంటి నరసభూప."

⁠

ఇట్లు చూపఁబూసిన గ్రంథమంతయు వ్రాయునగును. కావున స్థాలీపులాకన్యాయము ననుసరించి కొన్ని చూపితిమి.