Jump to content

పుట:Narasabhupaleeyamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సోము ప్రసాదంబు, సోమయాజుల నియ, మంబు, భాస్కరుని సన్మార్గఘటన,
శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి, యమరేశ్వరుని సహస్రముఖదృష్టి,


గీ.

నీక కల దటుగాన ననేకవదన, సదనసంచారఖేదంబు సడలుపఱిచి
భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె, మూర్తికవిచంద్ర విఖ్యాతకీర్తిసాంద్ర.

ఇది యతిశయోక్తి యని తలంపరాదు. చెప్పినట్లు చేయుట సామాన్యముగ నందఱకు నలవిగానిపనియే కాని యీతఁ డట్లు చేయఁజాలినవాఁ డని సులభముగఁ దోఁచును.

అప్పకవీయాది లక్షణగ్రంథము లొప్పని రేఫద్వయమైత్రి, యిత్వసంధులు మొదలగువానిని అచ్చటచ్చట నీకవి యుపయోగించి యున్నాడు.

రేఫద్వయమైత్రికి

“వేఱ వివరింప నేల బంగారమునకుఁ, జటుల సౌరభ్యలహరి యబ్బుటయ కాదె"


"శా.

శ్రీరంగప్రభుతిమ్మశౌరి భుజకౌక్షేయంబుచే నాజుల
న్వీరారాతులఁ ద్రుంప నాక్షితిపతు ల్వేవేగ మార్తాండునిం
దూఱందూఱఁ దదీయమండలసముద్భూతవ్రణశ్రేణికి
న్నీరంధ్రౌషధచూర్ణభాతిఁ దగుఁ నెంతేఁ దచ్చమూరేణువుల్."

ఇంక నీకవి కవితాశక్తిని గుఱించి కొంచెము వ్రాసెదము. ఈమూర్తికవికి నతిశయోక్తి క్రమాలంకారాదులు మంచినీళ్లప్రాయములు,

ఈ క్రిందియుదాహరణము లీవిషయమును దేటపఱచును.

క్రమాలంకారము

“సీ.

కమలాప్త కమలాప్త కమలాప్తసన్నిభుం, డేవిభుండు రుచి ప్రభావ దయల
గోరాజ గోరాజ గోరాజసంకాశుఁ, డేరాజు మతి భోగ గౌరవముల
హరిపుత్త్ర, హరిపుత్త్ర హరిపుత్త్ర సదృశుఁ డే, ధన్యుండు జయరూప దాసవిధుల
నాగారి నాగారి నాగారికల్పుఁ డే, మేటి ప్రాభవ వేగ పాటవముల


తే.

నతఁడు సువిచారుఁ డవికారుఁ డనఘుఁ డలఘుఁ, డప్రమేయుఁ డజయ్యుఁ డతి ప్రతాపుఁ
డప్రతీపుఁ డనేకలోకాభివంద్యచరితుఁ డింపొందు వల్లభక్ష్మావరుండు.”

అతిశయోక్తి

"ఉ.

భూనుతశౌర్యుఁ డోబనృపపుంగవుఁ డుగ్రరణోర్విభీమబా
హానిశితాసిధార నవతాహితకోటియుదన్తహస్తము