పుట:Nanakucharitra021651mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్చలభక్తిని శాంతమును మనోధైర్యమును భూతదయను జూచినవారందరిదివఱ కెంతభక్తిహీనులైనను తప్పక భక్తితత్పరులగుదురు. అందుచేతనే మర్దనుడు స్వలాభాన్వేషిగాక నానకునకుశిష్యుడయ్యెను. పుత్రుడు చెడిపోయినాడని దు:ఖితుడైన కాళుని మర్దను డూరడించి గుణత్నాకరుడగు నట్టికుమారుడు గర్భమున జనించినందున దన్నుధనుడుగా భావించుకొనక విచారించుట యవివేకమనియు వానికుమారుడు లోకసామాన్యుడు కాడనియు శ్రీకృష్ణుని యవతారమనియు సూర్యచంద్రుల యంశమున బుట్టెననియు మఱియు బెక్కుభంగుల దన భక్తికొలది చెప్పి వాని వీడ్కొని మొదటినుండియు నానకునందు మంచియభిప్రాయము గలిగియుండిన రాయబులారు వద్దకుబోయి నానకు వృత్తాంతమంతయు వానికి కెఱిగించెను. రాయబులారు నానకువృత్తాంతమును కాళుడువిన్నట్లు వినక మున్ను తా ననుకొన్నదానికి నాడు విన్నదానికి సరిపోయెనని చాలసంతసించి తాల్వెండీ గ్రామమునకు గురునానకు నొకసారి బంపుమని మర్దనుని వేడుకొని తనమాటలుగా వానికి విన్నవింపుమని కొన్నిపలుకులు చెప్పి పుచ్చెను. మర్దనుడు తనవెంట నీసారి బలుని దోడ్కొని పయనమై యమ్నాబాదునకు బోయెను.

పోయి "నానకును గాంచి యతడు రాయబులారుమాటలుగా నిట్లని విన్నవించెను" నేను చాలకాలమునుండి మహాత్ములగు మిమ్ము జూడగోరుచుంటిని. కాని వార్ధకము దేహ దౌర్బల్యము