డినదేశములలో నొక్కదానిపేరేనియు నీనాటిభూగోళశాస్త్రజ్ఞు లెఱుంగరు. ఆదేశములాకా కాలమున నట్టి పేళ్ళుండునో లేక చరిత్రకారులు జగమునలేని దేశముల నూహించి గ్రంథములలో వ్రాసిరో మనము చెప్పజాలము. మనము నిశ్చయముగా నొక్కవిషయమునుమాత్రము చెప్పగలము. ఇస్లాము మతస్థాపకుడగు మహమ్మదువారి జన్మస్థలమైన యరేబియా దేశమునకు గురునానకు పోవుట నిర్వివాదాంశము. ఆదేశమునకు సముద్రయానముచేసెనో మెట్టదారినిబోయెనో చెప్పజాలముకాని త్రోవలో పారసీకదేశపు రేవుపట్టణమగు బుషాహరునగరము నాయన జూచెను. మార్గవశమున నతడేయూరికి బోయిన నాయూర బ్రహ్మజ్ఞానమునం దాసక్తిగల మనుష్యులంజేర్చి వారికుపదేశముజేసి జ్ఞానబీజముల నచ్చట నాటియవి పెరిగి ఫలించునని తోచినచోట్ల చిన్నసంఘము లేర్పరచి ప్రతిసమితి నొక్క పెద్దనేర్పరచి వానికి భాయి యనుపేరు వెట్టి యతనియాజ్ఞకు వారు బద్ధులై యుండునట్లు శాసించి యటుపిమ్మట పోవుచువచ్చెను. హిందూదేశమునకు బడమట నున్న దేశములలో నేటికిని ధర్మశాలలుండుట కాద్యకారణమీతడే. అట్లుసమాజములు స్థాపించుటలో గురునానకు యొక్క తలంపు క్రొత్తమతము స్థాపింపవలయుననికాదు. మిక్కిలి పురాతనమైన యార్యుల యుపనిషన్మతమును జగమునకు జాటుటయే యాయన ముఖ్యసంకల్పము. తనచేత నుప
పుట:Nanakucharitra021651mbp.pdf/102
స్వరూపం