పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. మధ్యవయస్సు 40-60

ఈ దశలో నరుల్లో పెద్దమార్పు వస్తుంది. దేహబలం, శారీరక సౌందర్యం, లైంగిక శక్తి సన్నగిల్లతాయి. రక్తపోటు, మధుమేహం, వత్తిడి ప్రారంభమౌతాయి. మృత్యువును గూర్చిన ఆలోచనలు వస్తాయి. నరులు తమ జీవితాలనూ, లక్ష్యాలనూ, విలువలనూ పరిశీలించి చూచుకొంటారు. పిల్లలు పెరిగి పెద్దయి తల్లిదండ్రుల మాట అట్టే వినరు. వారికి అమ్మానాన్నలు వెనుకటి కాలపు మనుష్యులు అనిపిస్తుంది. నరులు తాము విశ్రాంతి తీసికొని తమ పనిని తర్వాత తరం వాళ్లకు అప్పగిస్తే బాగుంటుంది అనుకొంటారు. విశ్రాంతికి అనువైన పరిస్థితులను గూర్చి ఆలోచిస్తారు.

7. విశ్రాంతి కాలం 60-70

చాలాకాలం ఉద్యోగంజేసి పనిని విరమించు కొన్నవాళ్లకు ఊరకే వుండిపోవడం విసుగు పుట్టిస్తుంది. ఈ లోకంలో ఇక మనం సాధించేది ఏమీ లేదనిపిస్తుంది. ఒకరకమైన శూన్యతాభావం ఆవరిస్తుంది. అందుకే కొందరు పాక్షికమైన పనులు గాని సేవా కార్యక్రమాలు గాని చేపడతారు. ఈ తరుణంలో భాగస్వాములు ఒకరితో వొకరు సన్నిహితంగా ఐక్యమౌతారు. కొందరు దంపతులు పరస్పరం మనసు కలవక ఒకరినొకరు ద్వేషిస్తారు. ఇంకా యీ దశలో పిల్లలు పెండ్లిజేసికొని యింటినుండి వెళ్లిపోతారు. కనుక తల్లిదండ్రులు వంటరిగా వుంటారు. శూన్యతా భావం మరింత వేధిస్తుంది. పూర్వం తాము చేసిన పొర పాట్లకు పశ్చాత్తాపపడతారు. ఈ సమయంలో సేవా కార్యక్రమాలు, దైవచింతన మొదలైనవి ముమ్మరం జేసికోవాలి. 5-7వ యోజనుల దశలు.

8. అంత్యదశ 70 -

ఆధునిక కాలంలో వైద్యసదుపాయాలూ, నూతఔషధాలూ వృదుల వయస్సును పెంచాయి. ఐనా నేటి ప్రజలు యువతనూ చురుకుగా పనిజేసే వాళ్లను మెచ్చుకొంటారు. పని చేయలేని ముసలివాళ్లను విలువతో చూడరు. GD